ఏపీలోని పెన్షన్ లబ్దిదారులకు జగన్ సర్కార్ తీపికబురు చెప్పింది. మిచౌంగ్ తుఫాను నేపథ్యంలో పెన్షన్ల పంపిణీ గడువును ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. నిన్నటితో పంపిణీ గడువు ముగియగా…. పలువురు వాలంటీర్లు తుఫాను సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
దీంతో పెన్షన్ల పంపిణీ గడువును ప్రభుత్వం ఇవాల్టి వరకు పొడిగించింది. కాగా, ఈ నెలకు సంబంధించి 65.33 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, 64 లక్షల మందికి అందించారు.
కాగా మిచౌంగ్ తుఫాన్ కారణంగా ఏపీతో పాటు చెన్నై రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. అంతేకాదు.. మిచౌంగ్ తుఫాన్ కారణంగా ఏపీలో మరో 3 రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఏపీలో 9 జిల్లాలకు జగన్ సర్కార్ రెడ్ అలర్ట్ ప్రకటించింది. నెల్లూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ ,ప.గో., ఏలూరు, కోనసీమ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.