ఓ సినిమా తీయాలి అనుకున్నప్పుడు దర్శకుడు, రచయిత, నిర్మాత, కధానాయకుడు ఒక చోట కూర్చొని స్టోరీ, స్క్రిప్ట్ ఫైనల్ చేస్తారు. షూటింగ్ మొదలైన కొద్ది రోజుల తర్వాత దర్శకుడు స్క్రిప్ట్ కి భిన్నంగా సీన్స్ తీస్తుంటే ఎలా ఉంటుంది ? అయోమయంగా ఉంటుంది. హీరోకి అయితే ఇంకాస్త మండిపోతుంది. కానీ ఆ డైరెక్టర్ తన కన్నా స్థాయిలో పెద్ద వాడు కావడంతో నోరు తెరవలేకపోతుంటాడు. కానీ లోలోపల ఏమి జరుగుతుందో అర్ధం కాక అయోమయంలో పడతాడు. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ పరిస్థితి అలాగే వుంది. ఆపరేషన్ గరుడ ప్లాన్ రివర్స్ అవుతుందన్న భయానికి తోడు ఇప్పుడు పీఎం మోడీ వ్యవహారశైలి జగన్ ని టెన్షన్ పెడుతోంది.
ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం లో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు ముఖాముఖీ ఎదురు పడతారు అనగానే జగన్ చాలా ఊహించుకుని వుంటారు. చంద్రబాబుకి మోడీ చుక్కలు చూపిస్తారని అనుకుని వుంటారు. దీంతో చంద్రబాబు టెన్షన్ పడిపోతారు అనుకుని వుంటారు. కానీ జరిగింది వేరు. మోడీకి నమస్కారం చేయకుండానే చంద్రబాబు వెళ్లి నేరుగా తన సీటులో కూర్చున్నారు. ఇక సమావేశంలో తొలిసారిగా ప్రసంగించే అవకాశం వచ్చిన చంద్రబాబు విభజన హామీల మీద ప్రధాని మోడీ, హోమ్ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఎదుటే కేంద్రాన్ని నిలదీశారు. సీన్ అక్కడితో అయిపోలేదు.
టీ బ్రేక్ సమయంలో కేంద్రం మీద నిప్పులు చెరుగుతున్న ముఖ్యమంత్రులు చంద్రబాబు, మమతా బెనర్జీ, కుమారస్వామి, పినరపు విజయన్ లు ఉన్న చోటుకే మోడీ వచ్చారు. చంద్రబాబు సహా అక్కడ ఉన్నవారితో నవ్వుతూ మాట్లాడారు. ఇక ప్రధాని ప్రసంగంలో కూడా విద్యుత్ రంగంలో ఏపీ సాధిస్తున్న ప్రగతిని ప్రస్తావించడమే కాదు రాష్ట్ర ప్రభుత్వం, సీఎం మీద ప్రశంసల జల్లు కురిపించారు. మోడీ నవ్వులు, ప్రశంసల్ని ఎలా తీసుకోవాలో అర్ధం కాక పాదయాత్ర చేస్తున్న జగన్ తెగ మధనపడిపోతున్నాడట. ఇలా వ్యవహరిస్తే ఆపరేషన్ గరుడ ప్లాప్ అవుతుందని ఇప్పటి నుంచే దిగులు పడుతున్నాడు. అయినా ఇలా ఆవేదన చెందడమే గానీ మోడీ, షా లని అడిగే దమ్ము ఉండొద్దూ?