ఏపీలో వార్ వన్ సైడ్ అయి ఏపీలో వైఎస్సార్సీపీ గెలుపు ఖాయమైంది. ఇప్పటికే వైఎస్సార్సీపీ 150 సీట్లలో లీడ్లో ఉంది. టీడీపీ 24 సీట్లకే పరిమితమయింది. ఈసందర్భంగా వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఈనెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్నారని ప్రకటించారు. ఈనెల 25న వైఎస్సార్సీపీ శాసనసభాపక్షసమావేశం జరగనుంది. నిజానికి ఈ నెల 26 తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరిగింది. కానీ ముహూర్తం బాగుండటంతో జగన్ ఆ రోజు ప్రమాణస్వీకారం చేయడానికి విరమించుకుని మే 30వ తేదీన ప్రమాణస్వీకారం చేయాలని వైసీపీ అధినేత నిర్ణయించుకున్నారని సమాచారం. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సూచనల మేరకే జగన్ తన ప్రమాణస్వీకారోత్సవ ముహూర్తాన్ని మార్చుకున్నారని తెలుస్తోంది. కొంతకాలంగా ఇలాంటి అంశాల్లో ఎక్కువగా స్వరూపానంద సూచనలు పాటిస్తున్న వైసీపీ అధినేత. ప్రమాణస్వీకారోత్సవ ముహూర్తం విషయంలోనూ ఆయన సలహానే పాటించారని అందుకే ముందుగా అనుకున్న ముహూర్తాన్ని కాదని కొద్ది రోజులు వెయిట్ చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అయితే జగన్ ప్రమాణ స్వీకారోత్సవంఅమరావతిలో కాకుండా ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో ఆయన ప్రమాణ స్వీకారం జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అదే రోజు జగన్తో పాటు ఆయన కేబినెట్లోని మెజార్టీ మంత్రులు కూడా ప్రమాణం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని మీద అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.