ఇటీవల రేషన్ బియ్యంలో అక్రమాలు నిర్వహిచకుండా ప్రభుత్వం చాల చర్యలు నిర్వహిస్తుంది. ఇప్పటికే వలంటీర్ల వ్యవస్థ ద్వారా రేషన్ డిపోల్లో జరుగుతున్న అక్రమాలను చాలా వరకు అధికమించిది అనే చెప్పాలి. ఇక కార్డుల నుంచి విడిపోయిన వారి బియ్యం దుర్వినియోగం అవ్వకుండా అడ్డుకట్ట వేయడం జరిగింది.
ఇప్పుడు మాత్రం రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు బాగా చేపడుతుంది. ఇక మరో వైపు రేషన్ బియ్యం రీసైక్లింగ్ అవ్వకుండా, మిల్లర్ల ద్వారా మళ్లీ ప్రభుత్వం రాకుండా బాగా కృషి చేస్తుంది. గతంలో మాత్రం అటు రేషన్ డిపో డీలర్లు, ఇటు మిల్లర్ల ద్వారా పెద్ద ఎత్తున రేషన్ బియ్యం బాగా దుర్వినియోగం అవ్వడం జరిగేది. ఇందుకు ముఖ్య కారణం గతంలో సరైన పర్యవేక్షణ లేకపోవడం, అధికారులు, డీలర్లు, మిల్లర్లు, ప్రజాప్రతినిధులు కలిసిపోవడం అని అంటున్నారు.
ఇక తాజగా అవినీతి లేకుండా ప్రజలకు నాణ్యమైన బియ్యం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పం తీసుకున్న సంగతి అందరికి తెలిసిందే కదా. గత సెప్టెంబర్ నెలలో వలంటీర్ల ద్వారా సరుకులు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇలా చేయడం ద్వారా గతంలో జరిగిన అక్రమాలన్నీ వరుసుగా వెలుగులోకి రావడం జరిగింది.