శ్రీరామనవమి సందర్భంగా ‘జై హనుమాన్’ స్పెషల్ పోస్టర్ ..!

'Jai Hanuman' special poster on the occasion of Sri Ram Navami ..!
'Jai Hanuman' special poster on the occasion of Sri Ram Navami ..!

శ్రీ రామ నవమి పండుగను పురస్కరించుకుని త్వరలో రాబోయే మూవీ లు కొత్త పోస్టర్లు రిలీజ్ చేశాయి. వీటిలో అందరినీ ఆకర్షించింది మాత్రం ప్రశాంత్ వర్మ తెరకెక్కించనున్న జై హనుమాన్ మూవీ ది . వచనం ధర్మస్య రక్షణం ( మాట ధర్మాన్ని రక్షిస్తుంది) అంటూ ఈ పోస్టర్ కింద క్యాప్షన్ను జోడించారు. ఇక ఆ పోస్టర్లో శ్రీ రామునికి ఆంజనేయుడు మాట ఇస్తున్నట్లు వారి ఇద్దరి చేతులని చూపించారు. ఈ పోస్టర్ మూవీ పై మరింత ఆసక్తిని పెంచుతుంది .

ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ‘జై హనుమాన్’ మూవీ ను తెరకెక్కించే పనుల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అంజనాద్రి 2.0 అంటూ ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేయగా, దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు శ్రీ రామనవమి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ కూడా నెటిజన్లని తెగ ఆకట్టుకుంటోంది. ఈ మూవీ చూస్తుంటే హను-మాన్ను మించేలా ఉందంటూ నెటిజన్లు అప్పుడే పోస్టులు పెట్టేస్తున్నారు. ఎంతైనా మన వర్మ మూవీ అంటే వర్తు బ్రో అంటూ కామెంట్లు చేస్తున్నారు.