Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ‘జై లవకుశ’ చిత్రం షూటింగ్ రెండు పాటలు మినహా మొత్తం పూర్తి అయ్యింది. ఈ నెల చివరి వరకు ఆ రెండు పాటలను కూడా పూర్తి చేయబోతున్నారు. వినాయక చవితి సందర్బంగా ఈ చిత్రంలోని లవకుమార్ పాత్రకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న జై టీజర్ తరహాలోనే లవకుమార్ టీజర్ ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. ప్రేక్షకులు అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా టీజర్‌ను సిద్దం చేస్తున్నారు. ఇక ఈ చిత్రం ఆడియో విడుదలపై కూడా ఒక క్లారిటీ వచ్చింది.
చిత్ర యూనిట్ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే నెల 3వ తారీకున ఆడియోను వైభవంగా ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని ఒక కన్వెన్షన్ హాల్‌ను ఇప్పటికే బుక్ చేశారని కూడా సమాచారం అందుతుంది. ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యధికంగా ఈ చిత్రంపై అంచనాలున్నాయి. కారణం ఎన్టీఆర్ ఈ చిత్రంలో మూడు విభిన్న పాత్రలు చేయడంతో పాటు ఒక పాత్ర విలన్ పాత్ర అవ్వడంతో సినీ వర్గాల్లో కూడా ఈ సినిమాపై అంచనాలున్నాయి. దాదాపు 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌ను ఈ చిత్రం చేస్తుంది అంటే ఏ స్థాయిలో సినిమాపై క్రేజ్ ఉందో చెప్పుకోవచ్చు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుందని నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ చెబుతున్నాడు. దసరా కానుకగా సెప్టెంబర్ 22న విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
మరిన్ని వార్తలు: