Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న చిత్రం ‘జై లవకుశ’. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం ప్రారంభం సమయంలోనే దసరాకు విడుదల చేస్తామని దర్శకుడు ప్రకటించాడు. నిన్న మొన్నటి వరకు కూడా దసరాకు సినిమాను విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు. కాని పరిస్థితులు అందుకు అనుకూలించడం లేదు. సెప్టెంబర్ 22న విడుదల చేయాలంటే ఇప్పటి వరకు షూటింగ్‌ను పూర్తి చేయాల్సి ఉంది. కాని ఎన్టీఆర్ ఇతరత్ర కారణాల వల్ల షూటింగ్‌కు సరిగా హాజరు కాలేక పోతున్నాడు. దాంతో ‘జై లవకుశ’ చిత్రం షూటింగ్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది.
ఇంకా షూటింగ్ పూర్తి కాని ‘జై లవకుశ’ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లుగా మరో వారం రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వార్త నందమూరి అభిమానులకు చాలా పెద్ద బ్యాడ్ న్యూస్. అనుకున్న సమయానికి వచ్చి దసరాకు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందని అంతా ఊహించారు. కాని దసరా బరి నుండి ఎన్టీఆర్ తప్పుకోవడంతో అంతా నిరాశ చెందుతున్నారు. సెప్టెంబర్ నుండి చిత్రాన్ని అక్టోబర్ రెండవ వారానికి షిఫ్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా రాశిఖన్నా మరియు నివేదా థామస్‌లు నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఒక పాత్రలో గుడ్డి వాడిగా కనిపించబోతున్నాడు, ఒక పాత్రలో విలన్‌గా కనిపించనున్నాడు. ఈ రెండు పాత్రలు కూడా సినిమాకు హైలైట్ అవుతాయని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
మరిన్ని వార్తలు: