‘జై లవకుశ’ దొంగల అరెస్ట్‌

Jai Lavakusa Movie Footage Leaked Persons Arrested By Police

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Jai Lavakusa Movie Footage Leaked Persons Arrested By Police

ఎన్టీఆర్‌ ప్రస్తుతం ‘జై లవకుశ’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. బాబీ దర్శకత్వంలో కళ్యాణ్‌ రామ్‌ నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ చిత్రంకు సంబంధించిన కొన్ని సీన్స్‌ను చిత్ర యూనిట్‌కు సంబంధించిన కొందరు లీక్‌ చేయడం జరిగింది. ఆ విషయం చిత్ర యూనిట్‌ సభ్యులు బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. వెంటనే ఆ లీక్‌ అయిన వీడియోను ఆన్‌ లైన్‌ నుండి తొలగించి, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎంక్వౌరీ చేసిన పోలీసులు లీక్‌ వీరులను పట్టుకున్నారు.

చిత్రానికి సంబంధించిన ఫుటేజ్‌ను ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఎంక్వౌరీ ప్రారంభించారు. అయితే వారు ఉద్దేశ పూర్వకంగా పోస్ట్‌ చేయలేదని అంటున్నారట. ఇలాంటి విషయాలను చూసి చూడనట్లుగా వ్యవహరిస్తే ముందు ముందు మరింత పెద్దగా అయ్యే అవకాశం ఉందని స్వయంగా కళ్యాణ్‌ రామ్‌ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చి వారిని అరెస్ట్‌ చేయించాడు. వారిపై పెట్టిన కేసును ఉపసంహరించుకునేందుకు కళ్యాణ్‌ రామ్‌ నో చెబుతున్నాడు. కోట్లు పెట్టి తీస్తున్న సినిమాలను సరదాగా లీక్‌ చేయడంపై చిత్ర రంగంకు చెందిన వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు:

 బిగ్‌ బాస్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్‌