Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ‘జైసింహా’ నిన్న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది. ఆశించిన స్థాయిలో సినిమా ఆకట్టుకోలేక పోయింది అంటూ పబ్లిక్ టాక్ వచ్చింది. అయితే మాస్ ఆడియన్స్కు కాస్త కనెక్ట్ అయ్యే మాదిరిగా కొన్ని కామెడీ సీన్స్ మరియు యాక్షన్ సీన్స్ ఉండటంతో సంక్రాంతి సీజన్ కనుక మంచి కలెక్షన్స్ వస్తాయనే టాక్ వినిపిస్తుంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం చిత్ర నిర్మాణంకు 35 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. అన్ని ఏరియాల్లో కూడా సి కళ్యాణ్ సొంతంగా బిజినెస్ చేశాడు. చిత్రంపై నమ్మకంతో తానే లోకల్ ఎగ్జిబ్యూటర్ల సాయంతో సినిమాను విడుదల చేస్తాను అంటూ సి కళ్యాణ్ ప్రకటించాడు. ఇక సినిమాపై ఉన్న అంచనాలు మరియు సంక్రాంతి సెలవులు కావడంతో సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి వారంలో 15 కోట్ల వరకు వసూళ్లు సాధించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆన్లైన్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ ద్వారా నిర్మాత ఖాతాలో 10 కోట్ల వరకు పడే అవకాశం ఉంది. మొత్తంగా జైసింహా వల్ల పెద్ద నష్టమేమీ లేదని, పెట్టుబడి వరకు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.