Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సీఎల్పీ నేతగా విఫలమైన జానారెడ్డి.. ఇప్పుడు కొత్త కోరిక పుట్టుకొచ్చింది. ఓవైపు జానారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ఎప్పటికీ అధికారంలోకి రాదని ఎమ్మెల్యేలు అనుకుంటుంటే… ఇప్పుడు పీసీసీ కావాలని అడగటమేంటని సీనియర్లు చెవులు కొరుక్కుంటున్నారు. సీఎల్పీ కంటే పీసీసీకే ఎక్కువ పవర్ ఉంటుందని జానారెడ్డి వ్యాఖ్యానించడంపై కొత్త అనుమానాలు కలుగుతున్నాయి.
ఇప్పటికే జానారెడ్డి హస్తిన స్థాయిలో సైలంట్ గా ప్రయత్నాలు మొదలుపెట్టారట. తన ప్రభావం ఉపయోగించి పీసీసీ చీఫ్ పదవి కోసం తెగ ట్రై చేస్తున్నారట. మరి జానా ఆశలు ఎంతవరకూ నెరవేరతాయో చూడాల్సిందే. సీఎల్పీ లీడర్ గా విఫలమైన జానారెడ్డికి.. అధిష్ఠానం అంత పదవి ఇస్తుందా అనేది ఆసక్తికరమే. మరోవైపు జానారెడ్డి గత ఎన్నికల్లో పీసీసీ చీఫ్ గా ఉంటే పార్టీ పరిస్థితి ఇలా ఉండేది కాదని ఆయన వర్గం ప్రచారం చేస్తోంది.
ఎన్నికల ముందు పీసీసీ చీఫ్ ల విషయంలో గందరగోళం నెలకొందని, అప్పట్లో పొన్నాల లక్ష్మయ్య నాయకత్వం సరిలేదని, అందుకే ఆయన పార్టీని విజయవంతంగా నడిపించలేకపోయారని జానా వర్గం చెబుతోంది. ఎన్ని పదవులు నిర్వహించినా పీసీసీ చీఫ్ ఇవ్వలేదని భావిస్తున్న జానారెడ్డి.. 70 ఏళ్ల వయసులో పీసీసీ చీఫ్ పదవి కోసం బాగా ట్రై చేస్తున్నారట.
మరిన్ని వార్తలు