Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాపుల ఓట్లు ప్రభావశీలంగా వున్న నంద్యాల ఉప ఎన్నికల్లో జనసేన ఎటు మొగ్గుతుంది ?… ఈ ప్రశ్నకి సమాధానం దొరికింది. ఉప ఎన్నికల్లో ఎటూ మొగ్గకుండా తటస్థంగా వుండనున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. నంద్యాల, క్షేత్ర స్థాయిలో పార్టీ శ్రేణుల అభిప్రాయం తీసుకున్నాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పవన్ చెప్పారు. 2019 ఎన్నికలకు ముందు ఏ ఉప ఎన్నిక వచ్చినా ఇదే పద్ధతి అనుసరిస్తామని ఆయన వివరించారు. ఈ ఎన్నికల ప్రచారంలో టీడీపీ కి పవన్ మద్దతు కోసం భూమా కుటుంబం గట్టి ప్రయత్నాలే చేసినా అవి ఫలించలేదు. తాజాగా పవన్ నిర్ణయం ఇటు టీడీపీ తో పాటు అటు వైసీపీ ని కూడా షాక్ కి గురి చేసింది.
పోటాపోటీగా వున్న నంద్యాల ఉప ఎన్నికల బరిలో జనసేన మద్దతు మీద టీడీపీ పరంగా కాకున్నా వ్యక్తిగత సంబంధాలు, సెంటి మెంట్ దృష్ట్యా భూమా వర్గం ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే పవన్ ప్రకటనతో వైసీపీ కూడా పెద్ద ఖుషీ కాలేదు. పవన్ మద్దతు కూడా లేకుండా ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే రానున్న రోజుల్లో ఎదురయ్యే రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయన్న భయం ఆ పార్టీది. పవన్ ఎటూ తమతో కలిసి రాడు, ఇక బాబుకి తెలియకుండా కన్ను గీటుతున్న బీజేపీ కూడా హ్యాండ్ ఇస్తుందన్న భయం వారిది. పవన్ గనుక టీడీపీ కి మద్దతు ఇస్తే ఓడిపోయినా చెప్పుకోడానికి ఓ సాకు దొరికేదని వైసీపీ ఆలోచన. ఇప్పుడు ఆ ఛాన్స్ మిస్ అయ్యిందని జగన్ బాధ.
మరిన్ని వార్తలు: