జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసే పనులు ఒకింత అర్ధం కాకుండా ఉంటాయని చెప్పాలి.అయితే తానేమీ మరీ చట్టం మరియు న్యాయాలకు నష్టం కలిగించే ధోరణిలో నిర్ణయాలు తీసుకోలేదు కానీ ఈ రోజుల్లో ముఖ్యంగా రాజకీయాల్లో మూడో వ్యక్తి వచ్చి ఒక మాట చెప్పాడు అంటే అవతల పార్టీ వాడు ప్రజల వెనుక గోతులు తవ్వుతున్నా సరే ఈ మూడో వ్యక్తి దగ్గినా సరే అదేదో పెద్ద తప్పులా చూపిస్తున్నారు.జనం కూడా అలాగే తయారయ్యారు అది వేరే విషయం.
అలా మూడో వ్యక్తిగా వచ్చిన పవన్ ఎంత అప్రమత్తంగా ఉండాలి ఎంత ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి,కానీ తానేమో ఇష్టమొచ్చిన పనులు చేసుకుంటూ పోతున్నారు కానీ వాటిని డిఫెండ్ చేసుకోడానికి మాత్రం వారి జనసైనికులు నానా అవస్థలు పడుతున్నారు.పవన్ తాను సినిమాలు చెయ్యడం మానేసానని ఇక పూర్తి జీవితం రాజకీయాలకే అంకితం ఇస్తున్నాని చెప్పేసారు.అలా జనసేన పార్టీ తరపున ప్రెస్ నోట్ కూడా విడుదల చేసారు.కానీ ఊహించిన విధంగా ఆయన మళ్ళీ సినిమాలు చెయ్యడం స్టార్ట్ చేసారు.
అయితే ఇతర పార్టీల్లో ఉన్న బాలయ్య,రోజాలు చేసుకోడం లేదా అంటే వారు కూడా చేసుకుంటున్నారు.కానీ ఇలా పవన్ లా ఒక మాట చెప్పి తప్పలేదు ఇది ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలి.అందుకే పవన్ ను ఇప్పుడు అందరూ విమర్శిస్తున్నారు.అందుకు జనసైనికులు మాత్రం ఏవేవో కారణాలు చెప్తూ పవన్ ను ఢిఫెండ్ చెయ్యడానికి అనేక పాట్లు పడుతున్నారు.వీరికి ఇబ్బంది లేకుండా అప్పుడు చెయ్యను అని చెప్పినట్టుగా ఒక ప్రెస్ నోట్ విడుదల చేసినట్టుగా ఈసారి చిన్న వివరణ ఇస్తూ ఇంకో ప్రెస్ నోట్ విడుదల చేస్తే ఈ కేస్ క్లోజ్..