Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఇప్పుడు ఓ డైలాగ్ బాగా చిరాకు పుట్టిస్తోంది. అందుకే పాపం తనని తెగ ప్రేమించే ఫాన్స్ మీద కూడా ఫైర్ అయిపోతున్నారు. ఇంతకీ ఆ డైలాగ్ ఇంకేంటో కాదు . “ కాబోయే సీఎం “. పవన్ పర్యటనల్లో ఆయన్ని పిచ్చిగా ఆరాధించే కొందరు “కాబోయే సీఎం “ అంటూ నినాదాలు చేస్తున్నారు . దీనికి ఇంకో నాయకుడు అయితే ఎలా రియాక్ట్ అవుతాడో గానీ పవన్ ఎంజాయ్ చేయడం అటుంచి చిరాకు పడుతున్నారు. ఫాన్స్ కి క్లాస్ తీసుకుంటున్నారు.
“ మీరు అరిచినంత మాత్రాన నేను సీఎం అవుతానా ?. సినిమా వేరు, రాజకీయం వేరు. ఊహాలోకంలో విహరించొద్దు. వాస్తవిక లోకంలో బతకండి.మీ ఆవేశం , ఆలోచన ని సైద్ధాంతికంగా మార్చుకోండి. అది మీతో పాటు జనసేనకు మేలు చేస్తుంది. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తే పార్టీకి , మీకు విలువ పెరుగుతుంది తప్ప అరుపులతో ఏమీ కాదు “ అని పవన్ అభిమానులకు పెద్ద ఎత్తున క్లాస్ పీకడంతో ఫాన్స్ కాస్త సైలెంట్ అయ్యారు.
ఒకప్పుడు బాలయ్య ఫాన్స్ కూడా సినిమా ఫంక్షన్స్ టైం లో ఇదే విధంగా నినాదాలు చేసేవాళ్ళు.మరీ ముఖ్యంగా లోకేష్ తో బ్రాహ్మణి పెళ్ళికి ముందు ఈ గోల ఎక్కువగా ఉండేది. వీరభద్ర లాంటి కొన్ని సినిమాల్లో సైతం మొహం చూస్తే కాబోయే సీఎం కళ కనిపిస్తోందని డైలాగ్స్ వున్నాయి. అప్పట్లో వీటి మీద బాలయ్య ఎంజాయ్ చేసేవాళ్ళు. అయితే బయటికి ఏమీ చెప్పకుండా అంతా భగవదేచ్ఛ అంటూ దేవుడు మీద భారం వేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఎప్పుడైతే లోకేష్ ని అల్లుడుగా చేసుకున్నారో అప్పటి నుంచి ఆ డైలాగ్స్ తగ్గాయి. బాలయ్య కూడా వాటిని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. కారణం ఏమిటో అందరికీ తెలిసిందే కదా.