తాడేపల్లిగూడెంకి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ. వైసీపీ తరఫున గెలిచి మంత్రి పదవిని కూడా పొందారు. కానీ ఈసారి తాడేపల్లిగూడెంలో గెలుపు ఎవరిది అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వైసిపి తరఫున సెట్టింగ్ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ పోటీ చేస్తారు అని అంటున్నారు. టిడిపి తరఫున వలవల బాబ్జి ఇన్చార్జిగా ఉన్నారు. కానీ టిడిపి తరఫున వలవల బాబ్జికి టికెట్ ఇచ్చే ఆలోచనలో అధిష్టానం లేదు. ఈలి నాని కూడా టిడిపి తరఫున టికెట్ కోసం ఎదురుచూస్తున్నారు.
జనసేన-టిడిపి పొత్తులో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. జనసేన తరఫున బోలిశెట్టి శ్రీనివాస్ అభ్యర్థిగా ఉన్నారు. తాడేపల్లిగూడెంలో ఓటర్లలో సగం కాపు సామాజిక వర్గం వారే ఉన్నారు. మిగిలిన వారు బీసీ వారు కాగా ఓసీ, ఎస్సీ,బీసీ వారు కాగా, ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం వారిదే పట్టు అని రాజకీయ వర్గాల అభిప్రాయం.
ఈసారి ఎన్నికల్లో జనసేన-టిడిపి పొత్తు నేపథ్యంలో జనసేన పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నియోజకవర్గంలో బొలిశెట్టి శ్రీనివాస్‌కు మంచి పట్టు ఉంది. గత 2019 ఎన్నికలలో ఆఖరి నిమిషంలో జనసేన తరఫున పోటీ చేసి ఇరవై ఒక్క శాతం ఓట్లను బొలిశెట్టి శ్రీనివాస్ సాధించగలిగారు. అదే పట్టుతో ఈసారి జనసేన టిడిపి కలిసి కచ్చితంగా గెలుపు ఉంటుందని టిడిపి జనసేన అభిప్రాయపడుతున్నాయి.
అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత, కొట్టు సత్యనారాయణ పై వస్తున్న విమర్శలు, కొట్టు సత్యనారాయణ పైన ఉన్న ప్రజలలో ఉన్న వ్యతిరేకత ఇవన్నీ కూడా జనసేనకు లాబించే అంశాలే. తాడేపల్లిగూడెంలో ఇప్పటివరకు గెలిచిన వారందరూ కాపు సామాజిక వర్గం వారే…. ఈసారి కూడా జనసేన అభ్యర్థిని తాడేపల్లిగూడెం వారు గెలిపిస్తారని రాజకీయ వర్గాల విశ్లేషణ.