డిగ్రీ కాలేజ్ లర్ లాంచ్ చేయడానికి వెళ్లిన మా ప్రధాన కార్యదర్శి జీవిత రాజశేఖర్ ఆ దర్శకుడికి క్లాస్ పీకారు. టాలీవుడ్ ఇండస్ట్రీ తలదించుకునేలా చేస్తున్నారంటూ మండిపడ్డారు. శృంగారం ఎక్కడపడితే అక్కడ చేయలేం కాదా..ఆలోచించి సినిమాలు తీయాలంటూ హితవు పలికారు. ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ తాజాగా హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జీవిత, ఈ ట్రైలర్లోని శృంగార సన్నివేశాలను .. లిప్ లాకులను చూసి షాక్ అయ్యారు. అంతేకాదు ఈ ట్రైలర్ రిలీజ్ కి తనని పిలిచినందుకు అసహనాన్ని వ్యక్తం చేశారు. జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘ ‘అర్జున్ రెడ్డి’, ‘ఆర్ ఎక్స్ 100’ పుణ్యమా అనీ, లిప్ లాక్ లేని తెలుగు సినిమా లేకుండా పోయింది. మనం ఇల్లు కట్టుకుంటే హాలులో కూర్చుంటాము .. బెడ్ రూములో పడుకుంటాము .. బాత్ రూమ్ లో స్నానం చేస్తాము. కానీ హాల్లోకి వచ్చి స్నానం చేయం గదా. ఏ పని ఎక్కడ చేయాలో అక్కడే చేయాలి .. రోడ్డుపై చేస్తే అసహ్యంగా ఉంటుంది. మనకూ కుటుంబాలు వున్నాయి .. ఆడపిల్లలు వున్నారు అనే సామాజిక బాధ్యతతో సినిమాలు చేయవలసిన అవసరం వుంది. ప్రతి ఒక్కరూ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ప్రతి వ్యక్తి జీవితంలో శృంగారం ఉంటుంది.. సెక్స్ ఉంటుంది. అవి ఉన్నంత మాత్రాన అవి ఎక్కడ చేయాలో అక్కడ చేస్తేనే బాగుంటుంది. పబ్లిక్‌గా రోడ్డు మీద చేస్తే అసహ్యంగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాలో బట్టలు విప్పుకోవడం.. సెక్స్ చేసుకోవడం.. అమ్మాయి అబ్బాయి మీద ఎక్కడం.. అబ్బాయి అమ్మాయి మీద ఎక్కడం కామన్‌గా చూపిస్తున్నారు. ఇవి మీ జీవితంలో లేవా అంటే అందరి జీవితంలోనూ ఉంటాయి. అయితే రోడ్డు మీద అలాంటి పనులు చేయం. సోషల్ మీడియాలో.. టీవీల్లో ఇలాంటివి ఉండటం లేదా? అని కొందరు వాదిస్తారు. నిజమే ఉన్నాయి. కానీ వాటిని మనం ఒక రూములో.. ఒక్కరం కూర్చుని చూస్తాం. సినిమా అనేది కొన్ని వందల మందితో కలిసి చూసేది. చాలామంది మధ్యలో మనం శృంగారం చేయం. అసభ్యంగా ప్రవర్తించం. మూవీలో ఇలాంటివి వచ్చేసరికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీ కార్యక్రమానికి వచ్చి నేను ఇలా మాట్లాడకూడదు. ఈ మాటలను కాంట్రవర్సీ కోసం కూడా చెప్పడం లేదు .. నా మనసుకి అనిపించింది చెప్పాను” అని అన్నారు.