ధడక్ కి జాన్వీ అంత పారితోషకం అందుకుండా ?

jhanvi-kapoor-remuneration-for-dhadak-movie

అలనాటి అందాల తార శ్రీ దేవి కూతురు ధడక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే సినిమా మొత్తానికి ఇప్పుడే ఆమే హైలైట్ గా నిలుస్తోంది. ‘ధడక్’ సినిమాలో జాన్వీ గనుక నటించకపోయుంటే, ప్రేక్షకుల్లో దానిపై ఈ స్థాయిలో ఆసక్తిని ఉండేది కాదు ఎందుకంటే ఆల్రెడీ మరాఠ భాషలో ఇదే కథతో సినిమా వచ్చేసింది. బాలీవుడ్ వారికి మరాఠతో మంచి అనుభంధం ఉంటుంది. దాదాపు అందరూ మాతృకని చూసేశారు కాబట్టి.. ‘ధడక్’ ఒక సాదా రీమేక్ గా నిలిచిపోయేది. అయితే ఈ సినిమాతో జాన్వీ కపూర్ తెరకు పరిచయం కావడంతో దీనిపై ఆసక్తి అందరిలోనూ రెట్టింపు అయ్యింది.

రీమేకే అయినప్పటికీ మరోసారి ఈ సినిమాను చూడాలనే ఆసక్తి మొదలైంది. ఈ రకంగా చూస్తే ‘ధడక్’కు ప్రధాన ఆకర్షణ జాన్వీ కపూర్. తన తొలి సినిమాతో నటనతో ఆకట్టుకుంది శ్రీదేవి తనయ. అయితే ఈ క్రమంలో ఆమె తొలి చిత్రానికి ఎంత పారితోషకం ఉంటుందా అని అందరి మైండ్ లలోను ఒక ప్రసంగ
తిరగాడుతోంది. దానికి క్లారిఫికేషన్ ఇచ్చింది ఒక బాలీవుడ్ పత్రిక. దాని వివరాల ప్రకారం.. ‘ధడక్’కు జాన్వీ కపూర్ పారితోషికం అరవై లక్షల రూపాయలు. తన తొలి సినిమాకు ఈ మేరకు పారితోషికం పొందిందట శ్రీదేవి తనయ. అలాగే ఈ సినిమాతోనే హీరోగా పరిచయం అయిన ఇషాన్ ఖట్టర్‌ కూడా అరవై లక్షల రూపాయల పారితోషికం అందుకున్నాడట.