Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కుతుంది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌తో కలిసి ఒక మల్టీస్టారర్‌ను చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత ఎన్టీఆర్ హీరోగా చేయబోతున్న సినిమాలో రవితేజ నటించే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతుంది. ప్రముఖ దర్శకుడు ఈ కాంబోను సెట్ చేయబోతున్నాడు. రవితేజ, ఎన్టీఆర్‌ల మద్య సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ కారణంగానే వీరిద్దరు కలిసి నటించేందుకు ఇప్పటికే ఓకే చెప్పారు. అయితే వీరి కాంబో మూవీ ప్రేక్షకుల ముందుకు రావాలి అంటే కొన్ని సంవత్సరాలు ఆగాల్సిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ కమిట్ అయిన సినిమాలు పూర్తి అవ్వాలంటే రెండు సంవత్సరాలు పడుతుంది. అంటే ఎన్టీఆర్, రవితేజల కాంబో మూవీ 2020లో వస్తుందేమో చూడాలి.
ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాల జోరు కొనసాగుతుంది. ఈ సమయంలోనే ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో కలిసి ఒక చిత్రాన్ని చేస్తున్నాడు. జక్కన్న దర్శకత్వంలో రూపొందబోతున్న ఆ సినిమా భారీ అంచనాల నడుమ తెరకెక్కుతుంది. తప్పకుండా ఆ సినిమా మంచి ఫలితాన్ని అందుకుంటుంది. మల్టీస్టారర్ సినిమాలు వరుసగా రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అందుకే ప్రేక్షకుల కోరిక మేరకు అప్పుడప్పుడు ఇతర హీరోలతో స్క్రీన్‌ను షేర్ చేసుకోవాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే రవితేజతో కూడా ఒక సినిమాకు కమిట్ అయ్యాడు. ఆ సినిమాకు సంబంధించిన విషయాలు మరికొన్ని నెలల్లో వెలువడే అవకాశం ఉంది.