Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారతదేశ పద్నాలుగో రాష్ట్రపతి కోవింద్ ప్రమాణం చేసి 24 గంటలు గడవక ముందే వివాదాస్పద జడ్జి కర్ణన్ ఆయన్ను టార్గెట్ చేశారు. తనకు క్షమాభిక్ష ప్రసాదించాలని పిటిషన్ పెట్టుకున్నారు. దీంతో కోవింద్ ఇరకాటంలో పడ్డారని న్యాయనిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. తనకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునేవారంతా దళిత వ్యతిరేకులన్న కోవింద్.. ఇప్పుడు కోవింద్ ను కూడా అదే గాటన కడతారా అనే సందేహాలు వస్తున్నాయి.
కర్ణన్ లాండి వాడితో ఎలా డీల్ చేయాలో కోవింద్ కు బాగా తెలుసని ఆయన సన్నిహితులు అంటున్నారు. కోవింద్ కు సుప్రీం లాయర్ గా పనిచేసిన అనుభవం ఉంది. కర్ణన్ కు ఎలా ఆన్సరివ్వాలో.. అలాగే ఇస్తారని చెబుతున్నారు. సుప్రీం న్యాయమూర్తులపై నోరేసుకు పడిపోయిన కర్ణన్.. కనీసం కోర్టు తీర్పును కూడా శిరసా వహించకుండా అపహాస్యం చేశారు. చివరకు పోలీసులు పట్టుకోవడంతో దొరికిపోయాడు.
దీంతో మరింత ఆగ్రహించిన సుప్రీం అసలు క్షమించే ప్రసక్తే లేదని, శిక్ష అనుభవించాలని తీర్పు చెప్పేసింది. ఈ దెబ్బతో సుప్రీం తీర్పుతో జైలు శిక్ష అనుభవిస్తున్న తొలి హైకోర్టు జడ్జిగా కర్ణన్ చెత్త రికార్డు సృష్టించారు. చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు రాష్ట్రపతిని ఆశ్రయిస్తే ఏం ఉపయోగమని కర్ణన్ విమర్శకులు మండిపడుతున్నారు. మరి కోవింద్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.
మరిన్ని వార్తలు: