కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వుతున్న ఏపీ

TDP party Will Try Not To Get One MP Seat For The BJP Party

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

చాలు. చేసిన నిర్వాకం చాలు. మూడేళ్లైనా అదిగో.. ఇదిగో అనడమే కానీ చేసిందేమీ లేదు. పైగా చంద్రబాబు లెక్కలు చెప్పాలని రోజు పార్లమెంటులో కామెడీ చేస్తున్నారు. ఏమీ చేయలేదనే బాథ కంటే.. చంద్రబాబు లెక్కలు చెప్పడం లేదనే ఆరోపణలు టీడీపీ ఎంపీలకు అరికాలి మంట నెత్తికెక్కేలా చేస్తున్నాయి. చంద్రబాబు ఢిల్లీ టూర్లో ఆయనతో సమావేశమైన ఎంపీలు బీజేపీతో కష్టమని తేల్చిచెప్పేశారట.

బీజేపీతో అంటకాగుతూ ఎన్నికలకు వెళ్తే పార్టీ పుట్టి మునుగుతుందని, కనీసం ఈ రెండేళ్లైనా వారితో కయ్యం పెట్టుకోవాలని కొంతమంది బాబుకు సూచించారట. దీనిపై సానుకూలంగా స్పందించిన బాబు… వెంకయ్యను కూడా క్రియాశీల రాజకీయాల్లోంచి తప్పించడం వ్యూహాత్మకమేనని, ఇక మనం కూడా పొలిటికల్ ప్లాన్ అమల్లో పెడదామని చెప్పారు. ఏం చేసైనా సరే.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాల్సిందేనని తమ్ముళ్లు పట్టుదలగా ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు మెతక వైఖరి విడనాడితే చాలు.. తమ సత్తా కేంద్రానికి చూపిస్తామని ధీమాగా ఉన్నారు. ముఖ్యంగా మోడీకి టీడీపీ సత్తా ఏంటో తెలియాలంటే.. వచ్చే ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా కమలానికి దక్కకూడదని, చంద్రబాబు తృతీయ ఫ్రంట్ ప్రయత్నాలు చేయాలని వాళ్లు అధిష్ఠానంపై ఒత్తిడి పెంచుతున్నారు.

మరిన్ని వార్తలు:

రాష్ట్రపతిగా కోవిద్ ప్రమాణం.

ఫిదా’ అయ్యి వరాలు ప్రకటించిన కేసీఆర్‌

ముద్రగడ యాత్రపై పోలీస్ ఉక్కుపాదం.