తమిళ స్టార్ హీరో సూర్య సతీమణి జ్యోతిక.. 36 వయోదినిలే చిత్రంతో వెండితెరకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళు సాధించింది. మంచి స్క్రిప్ట్ లని ఎంచుకుంటూ వెళుతున్న జ్యోతిక ..రీసెంట్గా తన మరిది కార్తీతో కలిసి ఓ చిత్రాన్ని మొదలు పెట్టింది. సత్యరాజ్ ముఖ్య పాత్రలో కనిపించనుండగా, జ్యోతికతో పాపనాశం తెరకెక్కించిన జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆన్సన్ పాల్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారట. గోవింద్ వసంత్ చిత్రానికి సంగీతం అందించనుండగా, సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కార్తీ.. జ్యోతిక సోదరుడి పాత్రలో కనిపించనున్నారని టాక్. ఈ ఏడాది అక్టోబర్‌లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
తాజాగా సూర్య నిర్మాతగా వ్యవహరిస్తున్న 2డీ ఎంటర్టైన్మెంట్ సంస్థలో ఓ సినిమా చేసేందుకు జ్యోతిక ముందుకొచ్చింది. ‘పొన్మగల్ వందాల్’ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం రీసెట్‌గా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. సీనియర్ దర్శక నటులు భాగ్యరాజ్, పాండియరాజన్, పార్తిబన్‌లు ముఖ్యపాత్రలు పోషిస్తుండటం విశేషం. ప్రతాప్ పోతన్ కీలకపాత్రలో కనిపిస్తారు. జేజే ప్రట్రిక్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సందేశాత్మక చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రానికి గోవింద్ వసంత సంగీతం సమకూర్చుతున్నారు. అతి త్వరలోనే చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుంది.