ఏపీ రాజకీయాలపై కేఏ పాల్ కీలక ప్రకటన

KA Paul's key statement on AP politics
KA Paul's key statement on AP politics

ఏపీ రాజకీయాలపై కేఏ పాల్ కీలక ప్రకటన చేశారు. ఏపీ రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ అయిన కేఏ పాల్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నిచోట్ల పోటీ చేస్తామని ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోను ప్రజాశాంతి పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వెల్లడించారు. తాను మాత్రం ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా పోటీ చేస్తానని ఆయన తెలిపారు. విశాఖపట్నంలోని ప్రజాశాంతి కార్యాలయంలో కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు.

బిజెపి ఎంపీ జివిఎల్ నరసింహారావు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ప్రజలు ఓడిస్తారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేస్తుంది. ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, స్మార్ట్ సిటీలు, నిధులు ఏ విషయంలోనూ న్యాయం చేయలేదని అన్నారు. కాబట్టి విశాఖ అభివృద్ధి బాధ్యత తాను తీసుకుంటానని…. తనను లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిపించాలని కేఏ పాల్ కోరారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడులకు ప్రధాని మోదీని ఢీకొనే దమ్ము లేదని అన్నారు. కాబట్టి తాను గెలిస్తే ప్రధానిని ఒప్పించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపుతానని అన్నారు.