‘ కబీర్ సింగ్’ 10 రోజుల కలెక్షన్లు ఎంతో తెలుసా..?

kabir singh ten days collection

షాహిద్ క‌పూర్, కైరా అద్వానీ కాంబినేషన్ లో వచ్చిన కబీర్ సింగ్ బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ చేసిన ఈ మూవీ జూన్ 21 ప్రేక్షకుల ముందుకు రాగా..సూపర్ హిట్ టాక్ తో ప్రదర్శించబడుతోంది. పది రోజుల్లో కబీర్ సింగ్ చిత్రం రూ.181.57 కోట్లు వసూలు చేసినట్లు బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. మరో రెండు రోజుల్లో ఈ సినిమా 200 కోట్ల క్లబ్ లోకి చేరుకోనుంది. షాహిద్ కపూర్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా కబీర్ సింగ్ నిలిచింది. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెలుగులో వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రానికి రీమేక్‌గా కబీర్ సింగ్ తెరకెక్కింది.