భారీగా పెంచేసిన కాజల్ !

Kajal Aggarwal high Remuneration in Teja movie

లక్ష్మి కళ్యాణం సినిమాతో తెరంగ్రేటం చేసిన పంజాబీ భామ కాజల్ అగర్వాల్, మగధీరతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది. ఒకానొక దశలో ఆమె డేట్స్ దొరక్క చాలా సినిమాలు వదిలేసుకోవాల్సి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు స్టార్ హీరోల‌తో వ‌ర‌స సినిమాలు చేయ‌డానికి ఒప్పుకుంటే అదో లెక్క‌. కానీ త‌న‌కంటే ఇమేజ్ లో చిన్న‌వాడైనా హీరోతో న‌టించ‌డానికి రెండో సారి కూడా ఒప్పుకుందంటే దాని మతలబు ఏమిటా అని బుర్ర బద్దలుకోట్టుకుంటే తెలిసొచ్చింది. టాలీవుడ్ తో పాటు దక్షిణాది భాషా సినిమాల్లో బిజీగా మారిపోయిన కాజల్, జాతీయ స్థాయిలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్ళింది. అలా వెళ్లిన కాజల్ కు అక్కడ వర్క్ అవుట్ కాలేదు బాలీవుడ్ లో పోటీ ఎక్కువగా ఉండటం, పైగా చేసిన సినిమా పరాజయంపాలవ్వడంతో తిరిగి టాలీవుడ్ కు వచ్చేసింది. కాజల్ బాలీవుడ్ కు వెళ్లిన సమయంలో టాలీవుడ్ కు కొత్త భామలు వచ్చారు. దీంతో ఇక్కడ కూడా పోటీ పెరిగింది. అవసరమైతే తన రెమ్యునరేషన్ ను తగ్గించుకోవడానికి కూడా కాజల్ రెడీ అని చెప్పడంతో కాజల్ కు టాలీవుడ్ లో తిరిగి అవకాశాలు వచ్చాయి.

సీనియర్ హీరోలకు సరైన జోడి లేకపోవడంతో కాజల్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక తేజ.. రానా కంబినేషన్లో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమా సూపర్ హిట్ కావడంతో ఈమెకు డిమాండ్ పెరిగింది. తేజ దర్శకత్వంలోనే ఇప్పుడు మరో మూవీలో కాజల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. వరసగా ఆఫర్లు వస్తుండటంతో కాజల్ తన రెమ్యునరేషన్ పెంచనున్నదట. ఈ చిత్రం కోసం ఏకంగా రెండు కోట్ల‌కు పైగానే రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుందని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ఏది ఏమయినా బాలీవుడ్ వర్క్ అవుట్ కాకపోయినా టాలీవుడ్ మళ్ళీ అక్కున చేర్చుకోవడం అంటే మామూలు విషయం కాదు కాజల్ కి ఎక్కడో మచ్చ ఉంది సుమా అనుకుంటున్నారు సినీ జనాలు.