Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సుదీర్ఘ కాలంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా కాజల్ అగర్వాల్ దూసుకు పోతుంది. ఆ మద్య కాస్త గ్యాప్ వచ్చినా కూడా మళ్లీ ఈమె పుంజుకుంది. తెలుగు మరియు తమిళంలో స్టార్ హీరోలకు జోడీగా నటిస్తూ ఉన్న ఈ అమ్మడు ఈ సంవత్సరం ఖైదీ నెం.150 మరియు నేనే రాజు నేనే మంత్రి చిత్రాలతో పాటు ఇంకా పలు తమిళ చిత్రాల్లో కూడా నటించింది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్‌తో ఒక చిత్రాన్ని చేస్తోన్న ఈ అమ్మడు తమిళంలో క్వీన్ రీమేక్‌లో నటిస్తోంది. ఇక తాజాగా ఈమె శర్వానంద్‌కు జోడీగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి.
‘మహానుభావుడు’ చిత్రం తర్వాత శర్వానంద్ రెండు చిత్రాలు చేస్తున్నాడు. ఆ రెండు చిత్రాల్లో ఒకటి సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో హీరోయిన్గా కాజల్‌ను ఎంపిక చేయడం జరిగింది. ఆ చిత్రం షూటింగ్ ప్రారంభంకు సిద్దం అవుతుంది. శర్వానంద్‌కు జోడీగా నటించేందుకు కాజల్ ఏకంగా 1.5 కోట్లు డిమాండ్ చేసినట్లుగా సమాచారం అందుతుంది. శర్వానంద్ చిన్న హీరో కనుక కాజల్ ఎక్కువ పారితోషికం డిమాండ్ చేసింది. అయితే చిత్ర యూనిట్ సభ్యులు ఫైలన్గా కాజల్‌ను 1.3 కోట్లకు ఒప్పించారు. ఇటీవల కాజల్ పలు చిత్రాలకు కోటికి పైగా పారితోషికాన్ని తీసుకుంటుంది. కాజల్ పని అయిపోయిందని భావించిన తర్వాత ఇంత భారీ పారితోషికం తీసుకోవడం అందరికి ఆశ్చర్యం కలిగించే విషయం.