‘క‌ల్కి 2898 AD’ టీజ‌ర్…రిలీజ్ అవ్వకముందే ట్విట్టర్ లో అదిరిపోయింది!

'Kalki 2898 AD' Teaser...before it was released, it went viral on Twitter!
'Kalki 2898 AD' Teaser...before it was released, it went viral on Twitter!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న ప్రెస్టీజియ‌స్ సైన్స్ ఫిక్ష‌న్ సినిమా ‘క‌ల్కి 2898 AD’ కోసం ఆడియెన్స్ ఏ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారో ప్ర‌త్యేకించి చెప్పనవసరం లేదు . నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ పై అంచ‌నాల‌ను నెక్ట్స్ లెవెల్ లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్ట‌ర్స్, టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ని మెస్మ‌రైజ్ చేశాయి.

కాగా, ఈ మూవీ పై అంచ‌నాల‌ను రెట్టింపు చేసే విధంగా మేక‌ర్స్ ‘బుజ్జి & భైర‌వ’ యానిమేష‌న్ సిరీస్ ని రూపొందించారు. అయితే, ఇప్పుడు మ‌రో టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతుంది . క‌ల్కి టీజ‌ర్ ని డిస్నీలెగో యానిమేషన్ రూపంలో కొంద‌రు రీక్రియేట్ కూడా చేశారు. ఇది చూసిన అభిమానులు మ‌రోసారి క‌ల్కి టీజ‌ర్ కి ఫిదా అవుతున్నారు.

'Kalki 2898 AD' Teaser...before it was released, it went viral on Twitter!
‘Kalki 2898 AD’ Teaser…before it was released, it went viral on Twitter!

ఇలా కల్కి పై ఎక్క‌డ చూసినా భారీ అంచ‌నాలు క్రియేట్ అవుతుండ‌టంతో, ఈ మూవీ ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అంద‌రూ ఏంటో ఆస‌క్తిగా చూస్తున్నారు. ఇక క‌ల్కి సినిమా లో క‌మ‌ల్ హాస‌న్, అమితాబ్ బ‌చ్చ‌న్, దీపిక పదుకొనె, దిశా ప‌టానీ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌ల ల్లో నటిస్తున్నారు. ఈ మూవీ ను వైజ‌యంతి మూవీస్ బ్యానర్ వారు అత్యంత భారీ బ‌డ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాగా, క‌ల్కి ట్రైల‌ర్ జూన్ 10న రిలీజ్ అవుతుండ‌గా, ఈ మూవీ ను జూన్ 27న రిలీజ్ చేస్తున్నారు.