Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు సినిమా పరిశ్రమను కుదిపేస్తున్న కాస్టింగ్ కౌచ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. గత కొంత కాలంగా సినిమా పరిశ్రమ పెద్దలకు సంబంధించిన లీక్స్‌ను బయట పెడుతున్న శ్రీరెడ్డి పెను సంచలనంకు తెర లేపుతున్న విషయం తెల్సిందే. శ్రీరెడ్డి చేస్తున్న విమర్శలకు సినీ ప్రముఖులు కొందరు తల ఎత్తుకోలేక పోతున్నారు. ఈ సమయంలోనే శ్రీరెడ్డికి సంబంధించిన కొన్ని లీక్స్‌ను నటి కరాటే కళ్యాణి బయట పెట్టడం జరిగింది. శ్రీరెడ్డిపై కళ్యాణి గతంలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. ఆ ఆరోపణలకు తాజాగా సాక్ష్యాధారాలను కూడా కళ్యాణి సమర్పించింది.
కళ్యాణి ఫేస్బుక్లో శ్రీరెడ్డికి సంబంధించిన కొన్ని వ్యక్తిగత ఫొటోలను విడుదల చేయడం జరిగింది. ఆ ఫొటోలు ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. శ్రీరెడ్డికి ఇంటర్ చదువుతున్న కూతురు ఉందని, అలాగే తాను ఒంటరిగా జీవిస్తున్నట్లుగా ఆమె చెబుతున్న విషయం నిజం కాదని, ఆమె తల్లి దండ్రులకు దూరంగా ఉండటం లేదని కళ్యాణి పేర్కొంది. ఇటీవలే ఒక ఖరీదైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసిన శ్రీరెడ్డి తన తల్లిదండ్రులతో కలిసి ఆ అపార్ట్మెంట్లోకి గృహప్రవేశం చేసిందని చెప్పుకొచ్చింది. శ్రీరెడ్డి కోటికి పైగా ఖర్చు చేసి కారును కూడా కొనుగోలు చేసిందని, ఆ డబ్బులు ఎక్కడివి అనే విషయం ఆమె చెప్పాలి అంటూ కళ్యాణి డిమాండ్ చేసింది. మొత్తానికి కళ్యాణి చేసిన లీక్స్ శ్రీరెడ్డిని ఇరుకున పెట్టాయి. మరి వీటిపై శ్రీరెడ్డి ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.