బన్నీకి పెద్ద రిలీఫ్‌

naa peru surya naa illu india censor board talk

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

అల్లు అర్జున్‌ ఆర్మీ ఆఫీసర్‌గా నటించిన ‘నా పేరు సూర్య’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దం అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంను ముందుగా ఏప్రిల్‌ నెలలోనే విడుదల చేయాలని భావించారు. అయితే ‘భరత్‌ అనే నేను’ మరియు ‘కాలా’ చిత్రాలకు సైడ్‌ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో మే నెలకు అల్లు అర్జున్‌ షిఫ్ట్‌ అయ్యాడు. తాజాగా భరత్‌ అనే నేను విడుదల అయ్యింది. అయితే మరో వారంలో విడుదల కావాల్సిన ‘కాలా’ చిత్రం మాత్రం విడుదలకు నోచుకోలేదు. నా పేరు సూర్య విడుదల సమయంలోనే ‘కాలా’ చిత్రాన్ని కూడా విడుదల చేస్తారా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కాని తాజాగా ‘కాలా’ చిత్రాన్ని జూన్‌ 7న విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు.

‘కాలా’ చిత్రం విడుదల ఇప్పట్లో లేని కారణంగా అల్లు అర్జున్‌ ‘నా పేరు సూర్య’ చిత్రానికి పోటీ లేదని తేలిపోయింది. ‘భరత్‌ అనే నేను’ చిత్రం రెండు వారాల్లో కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అలాంటి సమయంలో ‘నా పేరు సూర్య’ చిత్రం ఒంటరిగా బరిలోకి దిగితే దుమ్ము దుమ్ముగా కలెక్షన్స్‌ రావడం ఖాయం అని అంతా భావిస్తున్నారు. తాజాగా సెన్సార్‌ పూర్తి చేసుకుని యూ/ఎ సర్టిఫికెట్‌ను పొందిన నా పేరు సూర్య చిత్రానికి సెన్సార్‌ బోర్డు నుండి పాజిటివ్‌ టాక్‌ దక్కింది. అతి త్వరలోనే ఈ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాలను స్పీడ్‌ పెంచబోతున్నారు. ఇటీవలే షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.