Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళ రాజకీయాల్లో సరికొత్త పార్టీ పుట్టింది. నటనకే భాష్యం చెప్పిన కమల్ హాసన్ రాజకీయాలలోకి అధికారకారికంగా అడుగు పెట్టారు. మధురైలో ఈ సాయంత్రం జరిగిన సభలో కమల్ కొత్త పార్టీ ప్రకటించారు. ఆ పార్టీ పేరు “మక్కల్ నీతి మయ్యం”. జస్టిస్ ఫర్ పీపుల్, జనానికి న్యాయం అనే అర్ధం లో పార్టీ పేరు వుంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఈ సభలో పాల్గోవడం , నిన్నరాత్రి చంద్రబాబు కమల్ ని అభినందించడం చూస్తుంటే కొత్త పార్టీ తమిళ్ రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించడానికి తహతహలాడుతున్నట్టు అర్ధం అవుతోంది. చంద్రబాబుని తన హీరో గా కమల్ అభివర్ణించడంతో తెలుగు ప్రజలు కూడా ఈ కొత్త పార్టీ ఏర్పాటు మీద ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు.