చ‌ర‌ణ్ ప్రేయ‌సిగా రాశిఖ‌న్నా…?

Raashi Khanna in Rajamouli Multistarrer
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

హీరోయిన్ రాశిఖ‌న్నా స్టార్ హోదాకు చేరువ‌యింది. ఫీల్ గుడ్ మూవీ తొలిప్రేమ ఆమె కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయింది. రాశి కెరీర్ తొలిప్రేమ‌కు ముందు, త‌రువాత అన్నవిధంగా సాగ‌నుంది. ఈ హిట్ త‌ర్వాత ఆమెకు అవ‌కాశాలు క్యూ క‌డుతున్నాయి. తాజాగా ఓ ప్రిస్టేజియ‌స్ ప్రాజెక్టులో ఆమె హీరోయిన్ గా ఎంపిక‌యిన‌ట్టు ఫిలింన‌గ‌ర్ లో ప్ర‌చారం జ‌రుగుతోంది. బాహుబ‌లి త‌ర్వాత ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా రాజ‌మౌళి తెర‌కెక్కించ‌నున్న‌ భారీ బ‌డ్జెట్ మూవీలో రాశిఖ‌న్నా ఓ హీరోయిన్ గా ఎంపిక‌యిన‌ట్టు స‌మాచారం. రామ్ చ‌ర‌ణ్ ప్రేయ‌సిగా రాశిఖ‌న్నా న‌టించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

అయితే చిత్ర‌యూనిట్ దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు. తొలిప్రేమ‌లో రాశి అభిన‌యం చూసిన త‌ర్వాత రాజ‌మౌళి ఆమెకు త‌న సినిమాలో అవ‌కాశం ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు టాలీవుడ్ వ‌ర్గాలంటున్నాయి. తొలిప్రేమ చిత్రం రాజ‌మౌళికి చాలా న‌చ్చింది. తాను ప్రేమ‌క‌థ‌ల‌కు అభిమానికాక‌పోయినా… తొలిప్రేమ చిత్రాన్ని ఆస్వాదించాన‌ని ఆయ‌న ట్విట్ట‌ర్ లో ప్ర‌శంసించారు. ముఖ్యంగా రాశిఖ‌న్నాను బాగా పొగిడారు. సినిమాలో రాశి అందంగా క‌నిపించింద‌ని, ఆమె అభిన‌యం కూడా బాగుంద‌ని అన్నారు. ప్రేమ‌క‌థ‌లో అద్భుతంగా న‌టించిన రాశిఖ‌న్నా త‌న సినిమాలో చ‌ర‌ణ్ ప్రేయ‌సి పాత్ర‌కు స‌రిగ్గా స‌రిపోతుంద‌ని జ‌క్క‌న్న భావిస్తున్నారు.