తెలుగు బిగ్‌బాస్ మొదటి సీజన్లో పలు చిత్రాల ప్రమోషన్స్‌ను నిర్వహించిన విషయం తెల్సిందే. ప్రతి వారం కూడా ఏదో ఒక చిత్రానికి సంబంధించిన చిత్ర యూనిట్ సభ్యులు బిగ్‌బాస్ ఇంటికి వెళ్లే వారు. కాని ఈసారి మాత్రం కాస్త సినిమాల ప్రమోషన్ బిగ్‌బాస్‌లో జరిపేందుకు ఆసక్తి చూపడం లేదు. బిగ్‌బాస్ సీజన్ 2లో ఇప్పటి వరకు మూడు సినిమాల ప్రమోషన్స్ జరిగాయి. ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లాపడ్డాయి. దాంతో ఇతర చిత్రాల ప్రమోషన్స్‌ను బిగ్‌బాస్‌లో చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఎట్టకేలకు ‘విశ్వరూపం 2’ చిత్రం ప్రమోషన్స్‌ను తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లో నిర్వహించేందుకు కమల్ రంగ ప్రవేశం చేయడం జరిగింది. తమిళ బిగ్‌బాస్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కమల్ హాసన్ తన సినిమా ప్రమోషన్ కోసం తెలుగు బిగ్‌బాస్ హౌస్‌కు రావడం కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
తెలుగు బిగ్‌బాస్‌లో ఇప్పటి వరకు చాలా సర్ప్రైజ్లు ఇంటి సభ్యులు మరియు ప్రేక్షకులు చూశారు. కాని ఇది అతి పెద్ద సర్ప్రైజ్గా చెప్పుకోవచ్చు. యూనివర్శిల్ స్టార్‌గా గుర్తింపు దక్కించుకున్న కమల్ హాసన్ తొగు బిగ్‌బాస్ ఇంటికి రావడంతో ఇంటి సభ్యులు అంతా కూడా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. కొన్ని సెకన్ల పాటు షాక్‌కు గురయిన ఇంటి సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గతంలో తెలుగు బిగ్‌బాస్ హోస్ట్ ఎన్టీఆర్ ఇంట్లోకి వెళ్లాడు. కాని ఇప్పటి వరకు కమల్ స్థాయి స్టార్ హీరో మాత్రం ఇప్పటి వరకు ఇంట్లోకి వెళ్లలేదు. కనుక నేటి ఎపిసోడ్ ఈ సీజన్లోనే అతి పెద్ద సర్ప్రైజ్గా చెప్పుకోవచ్చు. దాదాపు మూడు నాలుగు సంవత్సరాలుగా అదుగో ఇదుగో అంటూ వాయిదాలు పడుతూ వస్తున్న విశ్వరూపం 2 ఎట్టకేలకు ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగులో భారీ ఎత్తున విడుదల చేస్తున్న ఈ చిత్రంకు బిగ్‌బాస్ ప్రమోషన్ ఏ స్థాయిలో ఉపయోగపడుతుందో చూడాలి.
