Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రంపై ఇప్పటి వరకు అంతా కూడా ప్రశంసలు కురిపించిన వారే కాని విమర్శలు చేసిన వారు లేరు. మొదటి సారి మహానటి చిత్రంపై ఒకరు విమర్శలు గుప్పించారు. చరిత్రను ఉన్నది ఉన్నట్లుగా కాకుండా తప్పుగా చూపించారు అంటూ ఆమె చెబుతున్నారు. ఇంతకు ఆమె ఎవరో తెలుసా జెమిని గణేషన్ మొదటి భార్య కూతురు అయిన కమలా స్వెరాజ్. తన తండ్రి పరువు తీసే విధంగా సినిమాలో కొన్ని సీన్స్ ఉన్నాయని, తన తండ్రిని తక్కువ చేసి చూపించినందుకు చిత్ర యూనిట్ సభ్యులు క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ ఆమె డిమాండ్ చేసింది.
డాక్టర్ కమలా సెల్వరాజ్ తాజాగా తమిళంలో ఈ చిత్రాన్ని చూసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ… తన తండ్రి సినిమాల్లో ఉన్నంత కాలం చాలా బిజీ నటుడిగా ఉన్నారు. ఆయన ఎప్పుడు కూడా అవకాశాల కోసం ఎదురు చూడలేదు. తన తండ్రిని ఉమనైజర్‌గా చూపించే ప్రయత్నం చేశారు. తన తండ్రితో మొదట ప్రేమను సాగించింది సావిత్రి. ఆమె బలవంతం మేరకు తన తండ్రి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తన తల్లిని ఎంతో బాగా చూసుకునేవాడని ఆమె చెప్పుకొచ్చింది. సావిత్రికి మద్యం అలవాటును నాన్న చేశాడని సినిమాలో చూపించారు. కాని నిజంగా జరిగిందేంటి అంటే నాన్నకు మద్యం అలవాటే లేదు. సావిత్రి స్వయంగా తన తండ్రికి మద్యంను అలవాటు చేసి జీవితాన్ని నాశనం చేసే స్థాయికి దిగజార్చింది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రేక్షకులు జెమిని గణేష్‌ను ఒక స్టార్‌గా చూశారని, ఆయనకు కాదల్ మన్నన్ అంటే ప్రేమ రాజు అనే బిరుదును కూడా ఇచ్చారని గుర్తు చేసింది. తాము ఒక సమయంలో సావిత్రి ఇంటికి వెళ్లిన సమయంలో కుక్కలను ఉసిగొల్పి మరీ మమ్ములను ఇంట్లోంచి బయటకు పంపించిందని కమలా పేర్కొన్నారు.