Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రజ్యోతి లో ఆ పత్రిక అధినేత రాసిన ఓ ఆర్టికల్ ఇప్పుడు సంచలనంగా మారింది. వెల్ కం గ్రూప్ పేరిట ఒకప్పుడు జలగం వెంగళరావు అమలు చేసిన కమ్మ – వెలమ కాంబినేషన్ కోసం కెసిఆర్ ట్రై చేస్తున్నట్టు ఆర్కే రాయడం చర్చనీయాంశం అయ్యింది. పరిటాల కుమారుడి వివాహం సందర్భంగా కెసిఆర్ వ్యవహారశైలి ఇందుకు ఆస్కారం ఇచ్చినప్పటికీ అంధ్రజ్యోతిలో దానిపై కధనం వచ్చాక ఆ కోణంలో చర్చ ఎక్కువైంది. అయితే ఆర్కే కావాలనే ఈ పని చేసినట్టు ఆరోపిస్తూ కొంతమంది ఆయనకి బహిరంగ లేఖ రాశారు. అందులో కమ్మ జాతిని స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఆర్కే ని తప్పుబట్టారు. అయితే చిత్రం ఏమిటంటే ఈ లేఖ ఎవరో రాసారో అర్ధం గాకుండా కింద అన్ని కమ్మ సంఘాల పేర్లు వరసగా రాసేశారు. ఆర్కేని తప్పుబట్టడానికి నిజంగా అన్ని కమ్మ సంఘాలు కలిసి వచ్చాయా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.
ఈ ప్రశ్నకి సమాధానం చెప్పలేకే ఇలా కుల సంఘాల్ని వాడుకున్నట్టు అర్ధం అవుతోంది. ఈ లేఖ ని ఆర్కే ని తీవ్రంగా వ్యతిరేకించే ఓ ప్రముఖ పత్రిక లో పనిచేసే జర్నలిస్ట్ రాసినట్టు తెలుస్తోంది. పైగా ఆ లేఖలో వై.ఎస్ కన్నా కెసిఆర్ ఎక్కువగా కమ్మ కులాన్ని ఇబ్బంది పెట్టినట్టు, రెడ్ల కన్నా వెలమలు ఎక్కువగా టార్గెట్ చేసినట్టు ఉండటం కూడా ఈ సందేహాలకు తావిస్తోంది. మొత్తానికి సోషల్ మీడియాలో హల్ చెల్ చేస్తున్న ఆ లేఖ ప్రతి చదివితే ఇది ఎవరి ప్రయోజనాల కోసం ఎవరు రాసారో తేలిగ్గా అర్ధం అవుతుంది.