తుమ్మలకి ఫ్రీడమ్, ఆర్కేకి ఫ్రెండ్షిప్… అదిరిందయ్యా కెసిఆర్.

Kcr new strategies for kamma and Reddy caste in Telangana

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలంగాణలో సరికొత్త రాజకీయ, సామాజిక సమీకరణాలకు సీఎం కెసిఆర్ తెరలేపారు. విభజన ఉద్యమం జోరుగా సాగుతున్న టైం లో తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న రెడ్లని ఆకట్టుకోడానికి ఆయన లగడపాటి, రాయపాటి ,కావూరి అంటూ కమ్మ సామాజిక వర్గ నేతల్ని టార్గెట్ చేశారు. ఢిల్లీలో తెలంగాణ కి అడ్డుపడుతోంది కేవలం కమ్మ సామాజిక వర్గానికి చెందిన పారిశ్రామిక వేత్తలే అనే అభిప్రాయం కలిగించారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణాలో ఆ సామాజిక వర్గం ఇబ్బందులు ఎదుర్కొంటుందని అంతా భావించారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ జెండా తో రెడ్లు రాజకీయ ఆధిపత్యం నిలుపుకోడానికి ప్రయత్నించడం గమనించిన కెసిఆర్ ట్రాక్ మార్చేశారు. నాడు తాను విమర్శలు చేసిన వర్గానికి దగ్గర కావడానికి పరిటాల రవి కుమారుడు పెళ్లి వేడుకని భలే వాడేసుకున్నారు. జలగం వెంగళరావు టైం లో ట్రై చేసిన కమ్మ, వెలమ కాంబినేషన్ ని కెసిఆర్ ఇప్పుడు మరోసారి వెలుగులోకి తెచ్చారు. అయితే అందరు అనుకున్నట్టు ఇది ఇప్పటికిప్పుడు జరిగిన వ్యూహం కాదు.

తెలంగాణ పోరాట సమయంలోనే విభజన జరిగితే వచ్చే రాజకీయ పరిణామాల్ని కెసిఆర్ ఊహించారు. అందుకే తెలంగాణ సీఎం అయినప్పటినుంచే కోదండరాం దూకుడుకి బ్రేక్ వేశారు. ఎవరూ ఊహించని విధంగా తుమ్మల నాగేశ్వరరావు కి మంత్రివర్గంలో చోటు ఇచ్చారు. కాస్త జాగ్రత్తగా చూస్తే కెసిఆర్ క్యాబినెట్ లో మంత్రుల్లో స్వతంత్రంగా వ్యవహరించింది తుమ్మల ఒక్కరే. చివరకు కేటీర్, హరీష్ సైతం తుమ్మల గురించి మంచి మాటలు చెప్పడం చూసాం. ఇక తుమ్మల కూడా అనుకోని ఈ అదృష్టాన్ని జాగ్రత్తగా వాడుకున్నారు. చాలా మంది ఊహించినట్టు కాకుండా ఆయన ఎప్పటిలాగానే కమ్మ వనభోజనాలకు వెళ్లారు. కులానికి సంబంధించి గొప్పగానే మాట్లాడారు. కానీ కెసిఆర్ ఆయన్ని నిలవరించలేదు. పైగా ప్రోత్సహించారు. ఫ్రీడమ్ ఇచ్చారు. దీంతో తెరాస ప్రభుత్వం అంటే మొదట్లో బెదిరిపోయిన కమ్మలు తుమ్మల స్పీడ్ తో రిలాక్స్ అయ్యారు. కెసిఆర్ కి కావాల్సింది కూడా అదే. ఇక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తో పాత ఫ్రెండ్షిప్ కూడా పునరుద్ధరించారు. పరిటాల శ్రీరామ్ పెళ్ళికి వాళ్ళు ఇద్దరు కలిసే వెళ్లారు. కలిసే వచ్చారు. పైగా ఇదంతా ప్రపంచానికి తెలిసేలా చూసుకున్నారు. ఈ రెండు పరిణామాలతో తెలంగాణాలో కాంగ్రెస్ అండతో పాటు సెటిలర్స్ ని ఆకట్టుకుంటే రాజకీయ పునర్వైభవం వస్తుందని భావించిన రెడ్డి సామాజిక వర్గం కెసిఆర్ ప్లాన్ తో అవాక్కు అయ్యింది. అదిరిందయ్యా కెసిఆర్ అని తెరాస వర్గాలు తెగ మెచ్చుకుంటున్నాయి.