తీవ్ర ఆందోళన చెందుతున్న కనికా కపూర్ కుటుంబ సభ్యులు

తీవ్ర ఆందోళన చెందుతున్న కనికా కపూర్ కుటుంబ సభ్యులు

లండన్ ట్రిప్ తర్వాత భారత్ కు తిరిగివచ్చిన కనికా… పలువురు ప్రముఖులకు భారీ విందు ఇచ్చింది. ఈ విందుకు రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే, ఆము కుమారుడు, ఎంపీ దుష్యంత్ తో పాలు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఈ పార్టీ తర్వాత దుష్యంత్ ఏకంగా రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమానికి హాజరు కావడమే కాకుండా అక్కడ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తోనూ సన్నిహితంగా మెలగారు. ఈ క్రమంలో రాష్ట్రపతి కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి వచ్చింది.

మొత్తంగా కనికా వ్యవహారం కరోనా వేళ పెను కలకలమే రేపిందని చెప్పక తప్పదు. కనికాకు కరోనా పాజిటివ్ అని తేలిన వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు.తాజాగా ఆదివారం నాలుగోసారి నిర్వహించిన కరోనా పరీక్షల్లో కూడా ఆమెకు పాజిటివ్‌ అనే తేలింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఈ క్రమంలో కనికా 10 రోజుల నుంచి చికిత్స తీసుకుంటున్నప్పటికీ కరోనా బారి నుంచి బయటపడకపోవడం తమను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోందని ఆమె కుటుంబ సభ్యుల్లో ఒకరు తెలిపారు. ప్రస్తుతం విమాన సర్వీసులు కూడా నిలిచిపోవడంతో.. మెరుగైన చికిత్స కోసం కనికాను ఎక్కడికి తరలించలేకుండా ఉన్నామని తెలిపారు.

కనికా కోలువాలని భగవంతున్ని ప్రార్థించడం ఒక్కటే ప్రస్తుతం తాము చేయగలిగిన పని అని అన్నారు. అయితే కనికా పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్యం నిలకడగానే ఉన్నా.. కనికాను కరోనా వైరస్ పూర్తిగా వదలకపోవడమే ఆందోళన కలిగిస్తోంది.