ప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు మరణ వార్త మరవక ముందే, టాలీవుడ్.. మరో షాకింగ్ వార్త వినాల్సి వచ్చింది.. ప్రముఖ నిర్మాత, శ్రీమతి నారా జయ శ్రీదేవి హైదరాబాద్‌లో కన్నుమూసారు. ఆమె వయసు 60 సంవత్సరాలు. ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఈరోజు తుదిశ్వాస విడిచారు. కన్నడ, తెలుగు భాషల్లో ఆమె పలు సినిమాలు నిర్మించారు. తెలుగులో, శ్రీ మంజునాథ, చంద్రవంశం, వందేమాతరం, జగద్గురు ఆదిశంకర వంటి సినిమాలు నిర్మించి, అభిరుచి గల నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు నారా జయ శ్రీదేవి. గతకొంత కాలంగా ఆరోగ్య రీత్యా చిత్ర నిర్మాణానికి దూరంగా ఉంటున్నారు. జయ శ్రీదేవి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియచేసారు.