ప్రైవేట్ జెట్ ఎక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అదృశ్యం… గాలి మీదే అనుమానాలు !

Congress MLA Pratap Gowda Patil missing

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కర్ణాటక రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. సంఖ్యాబలం పెంచుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ స్పెషల్ ఆపరేషన్‌ మొదలు పెట్టింది. దీంతో తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్‌-జేడీఎస్‌లు మల్లగుల్లాలు పడుతున్నాయి. నిన్న ఎమ్మెల్యేలను ఈగిల్టన్ రిసార్టులో బస చేయించగా అందులో ఉన్న ఒక ఎమ్మెల్యే బయటకి వెళ్లి అదృశ్యం అవ్వడం కలకలం రేపింది. కర్ణాటకలోని మస్కి శాసన సభ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రతాప్ గౌడ పాటిల్ బుధవారం రాత్రి బెంగళూరు నగర శివార్లలోని బిడది సమీపంలోని ఈగల్టన్ రిసార్టు నుంచి మాయం అయ్యారు. ప్రతాప్ గౌడ పాటిల్ కోసం కాంగ్రెస్ నాయకులు గాలించారు. బెంగళూరు నగరంలోని హెచ్ ఏఎల్ ఎయిర్ పోర్టు నుంచి ప్రైవేటు విమానంలో ఆయన ఎక్కడికో వెళ్లిపోయారని కాంగ్రెస్ నేతలు గుర్తించారు.

2013 ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతాప్ గౌడ పాటిల్ తన ఆస్తుల విలువ రూ. 40 లక్షలు అని ఎన్నికల సంఘానికి అఫిడవిట్ సమర్పించారు. 2018 ఎన్నికల్లో తన ఆదాయం రూ. 17.50 లక్షలు అని, స్థిర, చర ఆస్తుల విలువ రూ. 5.5 కోట్లు, భార్య పద్మావతి ఆస్తులు రూ. 58. 8 లక్షలు అని ఎన్నికల సంఘంకు అఫిడవిట్ సమర్పించారు. దీంతో కర్నాటక ఎన్నికల్లో అందరి ఎమ్మెల్యేలలో ఆయనే అని తేలింది. కర్ణాటకలోనే పేద ఎమ్మెల్యే గా పేరు తెచ్చుకున్న ప్రతాప్ గౌడ పాటిల్ ప్రైవేటు విమానంలో ఎలా వెళ్లారు అనే విషయంపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. బళ్లారి బీజేపీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి హెచ్ఏఎల్ విమానాశ్రయానికి ప్రైవేటు విమానం పంపించి కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ పాటిల్ పారిపోవడానికి సహకరించారని తెలిసింది.

అయితే ఇక్కడ మరో సారి బీజేపీ తన బుద్ధి చూపించుకుంది కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలించేందుకు ప్రత్యేక విమానం కోసం పౌర విమానయాన శాఖని పర్మిషన్ అడిగితే నిరాకరించింది అయితే అలాంటిది ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే వెళ్ళడానికి ఎలా పర్మిషన్ ఇచ్చారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదవా అని. బీజేపీతో జాగ్రత్తగా ఉండాలని భావించిన కాంగ్రెస్ బీజేపీ పాలనలో లేని రాష్ట్రం అయితేనే సేఫ్ అని భావించి వారిని హైదరబాద్ కి తరలించినట్టు తెలుస్తోంది.