Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కర్ణాటక రాజకీయం ఇప్పుడు హైదరాబాద్ కి కూడా చేరింది. కేవలం కన్నడ ప్రజలే కాక యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అవసరమైన మెజార్టీ రాకపోవటం.. గవర్నర్ విచక్షణాధికారాల మేరకు గురువారం ఉదయం బీజేపీ సర్కారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం తెలిసిందే. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ లేని యడ్యూరప్ప 15 రోజుల్లోపు తన బలాన్ని అసెంబ్లీలో నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి తెరవెనుక బేరసారాలు సాగుతునట్టు వార్తలు తెలుస్తోంది. అందుకే తమ ఎమ్మెల్యేల్ని రక్షించుకోవటానికి కాంగ్రెస్.. జేడీఎస్ లు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇందులో భాగంగా తమ ఎమ్మెల్యేల్ని ఈగిల్టన్ రిసార్టుకు తరలించాలని ప్లాన్ చేయటం తెలిసిందే. అయితే బెంగుళూరులో ఎందుకు అనుకున్నారో ఏమో ఇందుకోసం పలు ప్రత్యామ్నయాలు చూసారు. ఏపీలోని విశాఖపట్నం సేఫ్ అని భావించి అక్కడికి తరలిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కాని చివరికి వారిని హైదరాబాద్ కి తరలించినట్టు తెలుస్తోంది.కాంగ్రెస్ తరఫున గెలిచిన 78 మందిలో 76 మంది హైదరాబాద్ చేరుకున్నారు. గత రాత్రి ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్ బయలుదేరిన వీరు, కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నేత టీ సుబ్బరామిరెడ్డికి చెందిన పార్క్ హయత్ హోటల్ లో కొందరు, తాజ్ కృష్ణ లో కొందరు, నోవోటెల్ లో కొందరు గండిపేట లోని గోల్కొండ హోటల్ లో కొందరిని బస చేయనున్నారు. వారు వస్తున్నారన్న సమాచారం ముందే అందడంతో బంజారాహిల్స్ ప్రాంతంలో పోలీసు బలగాలను మోహరించారు. కర్నాటక ఎమ్మెల్యేల బస ఏర్పాట్లు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.