కర్త కర్మ క్రియ రివ్యూ

Kartha-Karma-Kriya-Movie-Re

ఆనాది కాలంగా తెలుగులో ఒక హిట్ జానర్ ఉంది అంటే అది ద్రిల్లర్ అనే చెప్పాలి. ఎందుకంటే మిగతా ఇగత సినిమాల సంగతి ఎలా ఉన్నా ఈ థ్రిల్లర్ ల విషయంలో ప్రేక్షకుడు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి జానర్ లోనే నాగుగవర దర్శకత్వంలో వసంత్ సమీర్, సెహర్ జంటగా నటించిన చిత్రం ‘కర్త క్రియ కర్మ’. తన తొలి సినిమా వీకెండ్ లవ్ ని ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ గా , రెండో సినిమాను క్రైమ్ థ్రిల్లర్ గా శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఫిలిమ్స్ పతాకం పై వైవిధ్యమైన చిత్రాలను అందించె చదలవాడ బ్రదర్స్ నిర్మించిన ఈ చిత్రం, ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

Kartha-Karma-Kriya-Movie

క‌థేంటంటే.. సిద్ధు (స‌మీర్‌) ఓ సెల్ ఫోన్ మెకానిక్‌. ఉండేది బ‌స్తీలో. కానీ క‌ల‌లు గాల్లో ఉంటాయి. ఈజీ మనీ సంపాధించాలనే ఆలోచలనతో గడుపుతుంటాడు. క్రమంలో బైక్ షో రూమ్ లో జాబ్ చేసే మైత్రి (సెహర్) ని చూసి ప్రేమలో పడతాడు. ఇద్ద‌రూ ద‌గ్గ‌ర‌వుతున్న త‌రుణంలో అప్పటికే మైత్రి అక్క దివ్య ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని.. దివ్య చావుకి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నంలోనే మైత్రి ఉందని.. మైత్రి ద్వారానే సిద్ధుకు తెలుస్తోంది. ఈ విషయంలో సిద్దు మైత్రికి సహాయం చేస్తుంటాడు. ఈ ఆత్మ‌హ‌త్య‌కూ, న‌గ‌రంలో జ‌రిగిన మ‌రో రెండు ఆత్మ‌హ‌త్య‌ల‌కు ద‌గ్గ‌రి సంబంధం ఉంటుంది. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చెయ్యటానికి స్పెషల్ పోలీస్ ఆఫీసర్ రవివర్మ వస్తాడు. రవివర్మ విచారణలో సాగే కొన్ని నాటకీయ పరిణామాల తరువాత అసలు ఏం తేలింది ? దివ్యతో పాటు మిగిలిన ఇద్దరి ఆత్మహత్యలు వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి ? ఈ కేసులకు సిద్ధు ఏమైనా సంబంధం ఉందా ? ఉంటే ఈ కేసుల్లో సిద్దు ఎలా ఇన్ వాల్వ్ అయి ఉన్నాడు ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాలసిందే.

Kartha-Karma-Kriya-heroin
విశ్లేషణ : క‌థ చాలా రొటీన్‌. మూడు ఆత్మ‌హ‌త్య‌ల‌కు ఒక్క‌డే కారణం అతన్ని పోలీసులు ఎలా ప‌ట్టుకున్నార‌న్న‌ది పాయింట్‌. కానీ దీన్ని ద‌ర్శ‌కుడు రాసుకున్నంత బాగా తెరకెక్కించడంలో తడబడ్డాడు. సినిమా చాలా స్లో అనిపిస్తుంది. అస‌లు క‌థ‌లోకి వెళ్ల‌డానికే చాలా స‌మ‌యం తీసుకున్నాడు. దివ్య ఆత్మ‌హ‌త్య విష‌యంలో ర‌వితేజకు న‌లుగురిపై అనుమానం వస్తుంది. ఆ న‌లుగురినీ ఎలా విచారించాడు? ఎలాంటి క్లూస్‌ ప‌ట్టుకున్నాడ‌న్న‌ది సెకండ్‌ హాఫ్‌లో తెలుస్తుంది. అయితే థ్రిల్లర్ అయిన ఈ సినిమా ఎక్కడా థ్రిల్లింగ్ క‌లిగించ‌దు. చివ‌ర్లో ఏదైనా అద్భుత‌మైన ట్విస్ట్ వ‌స్తుందేమో అనుకుంటే అదీ లేదు. సినిమా మొద‌లైన కొంత‌సేప‌టికి ఓ పాత్ర‌పై ప్రేక్ష‌కుడికి అనుమానం క‌లుగుతుంది. అదే మెల్ల‌మెల్ల‌గా బ‌ల‌ప‌డుతూ వెళ్తుంది. చివ‌రికి ఆ ఆత్మహ‌త్య‌ల‌కు కూడా ఆ పాత్రే కార‌ణం అవుతుంది. మ‌ధ్య‌లోనే తేలిపోయిన ఈ క్రైమ్ స్టోరీని చివ‌రిలో మరేదైనా క్లైమాక్స్ ట్విస్ట్ ఇచ్చి ఉంటె బాగుండు. అయితే ‘ఈజీ మ‌నీ కోసం పాకులాడొద్దు… క‌ష్టాలు ప‌డ‌తారు’ అనే సందేశాన్ని సినిమా నుండి తీసుకోవచ్చు.

kartha-karma
ఎవ‌రెలా చేశారంటే: హీరో హీరోయిన్ లు ఇద్ద‌రూ కొత్త‌వారే. న‌ట‌న కూడా దానికి త‌గిన‌ట్టుగానే సాగింది. స‌మీర్ బాగున్నాడు. సెహ‌ర్ కొన్ని ఫ్రేముల్లో చూడ్డానికి చక్కగా ఉంది. సెకండ్‌ హాఫ్ మొత్తం ర‌వివ‌ర్మ‌దే. ఈ సినిమాలో త‌నే హీరో అనిపించినా ఆశ్చర్యపోకండి. ఇక కాదంబ‌రి కిర‌ణ్‌, కాశీ విశ్వ‌నాథ్, జయప్రకాశ్‌ రెడ్డి చిన్న చిన్న పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. త‌క్కువ బ‌డ్జెట్‌లో తీసిన సినిమా అయినా క్వాలిటీ బాగుంది. ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే దర్శకుడు నాగు గవర స్టోరీ లైన్ మంచిదే తీసుకున్నప్పటికీ, ఆ లైన్ ని ఎలివేట్ చేసే విధంగా స్క్రిప్ట్ ని రాసుకోలేకపోయారు. సంగీత దర్శకుడు శ్రవణ్ భరద్వాజ్ అందించిన పాటలు సినిమాకి తగ్గట్లుగానే ఉన్నాయి. అయితే ఆయన అందించిన నేపధ్య సంగీతం మాత్రం సన్నివేశాల అవసరానికి మించి ఉన్నట్టు అనిపించింది. ఇక సీనియర్ ఎడిటర్ ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాగాలేదు. చాలా చోట్ల స్లో మోషన్ షాట్స్ ను ఆయన మరి స్లో గా కట్ చేసినట్లు అనిపిస్తోంది.

kartha
తెలుగు బుల్లెట్ పంచ్ లైన్ : థ్రిల్ మిస్సయిన థ్రిల్ల‌ర్‌
తెలుగు బుల్లెట్ రేటింగ్ : 2. 5 / 5