‘తొలిప్రేమ’ కాన్సెప్ట్‌ మాత్రమేనా? రీమేకా?

pawan-tholiprema
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌ ఆరంభంలో పలు సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించాడు. ఆ సినిమాలు ఒక్కొక్కటి ఒక్కో విధమైన గుర్తింపును పవన్‌కు తెచ్చి పెట్టాయి. అందులో ఒకటే ‘తొలిప్రేమ’, 1998లో పవన్‌, కరుణాకరన్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘తొలిప్రేమ’ సినిమా అప్పట్లో యూత్‌ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించింది. పవన్‌ కళ్యాణ్‌కు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను మరింత పెంచిన చిత్రం అది. ఆ చిత్రంలో పవన్‌ నటన కూడా అద్బుతం. ట్రెండ్‌ సెట్టర్‌ సినిమాగా నిలిచిపోయిన ఆ సినిమాను రీమేక్‌ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ‘తొలిప్రేమ’ తర్వాత కరుణాకర్‌ ఎన్నో చిత్రాలను తెరకెక్కించాడు. కాని ఏవి కూడా ఆ స్థాయిలో సక్సెస్‌ కాలేదు. 

మరో భారీ సక్సెస్‌ కోసం కరుణాకరన్‌ మళ్లీ ‘తొలిప్రేమ’ను ఎంచుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. తొలిప్రేమ చిత్రాన్ని పవన్‌ కళ్యాణ్‌ మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌తో రీమేక్‌ చేయబోతున్నాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరిద్దరి కాంబో మూవీ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. అయితే వీరు చేయబోతున్న సినిమా ‘తొలిప్రేమ’కు రీమేకా అనే విషయంపై క్లారిటీ లేదు. సినీ వర్గాల్లో మరియు మీడియా వర్గాల్లో మాత్రం వీరు చేస్తున్నది తొలిప్రేమ సినిమా అంటూ ప్రచారం జరుగుతుంది. మెగా వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం తొలిప్రేమ కాన్సెప్ట్‌తోనే కథ ఉంటుంది. కాని మొత్తం తొలిప్రేమకు రీమేక్‌ కాదు అని అంటున్నారు. 

ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు భాష చిత్రాన్ని తెలుగు భాషలో లేదా హిందీ సినిమాను హిందీలో రీమేక్‌ చేసే పరిస్థితి లేదు. కారణం ఒక సినిమా బుల్లి తెరపై వందల సార్లు వస్తూ ఉంది. ఆ క్రమంలో మళ్లీ అదే స్టోరీతో సినిమాను తీస్తే ప్రేక్షకులు యాక్సెప్ట్‌ చేయరు. అందుకే నిర్మాతలు రీమేక్‌కు ఆసక్తి చూపించరు. ఇతర భాషల సినిమాలను రీమేక్‌ చేయడం ఓకే కాని, సొంత భాష చిత్రాన్ని సొంత భాషలో రీమేక్‌ చేయడం ఏమాత్రం కరెక్ట్‌ నిర్ణయం కాదు. అందుకే కరుణాకరన్‌ రీమేక్‌ నిర్ణయం తీసుకుని ఉండడు అని కొందరు భావిస్తున్నారు. కాన్సెప్ట్‌ను తీసుకుని, ఈతరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా సినిమాను తెరకెక్కిస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆధరిస్తారు.