కశ్మీర్ లోయలో ఈ మధ్య తరచుగా ఉగ్రవాదులకు.. భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కశ్మీర్ లోయలో భారత భద్రతా దళాలకు ఘనవిజయం సాధించారు. షోపియాన్ జిల్లాలోని రిబాన్ వద్ద భారత జవాన్లు నలుగురు మిలిటెంట్లను మట్టుబెట్టారు.
అయితే రిబాన్ ప్రాంతంలో మిలిటెంట్లు నక్కి ఉన్నారన్న సమాచారాన్ని తెలుసుకున్న భద్రతా దళాలు అదును చూసి ఉగ్రవాదులపై వేటు వేశాయి. భద్రతా బలగాలు పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి వారి మట్టుబెట్టాయి. జవాన్ల రాకతో పారిపోయేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వీరి కాల్పులను దీటుగా ఎదుర్కొన్న భారత దళాలు నగుగురిని ఒకేసారి హతం చేశాయి. కాగా వీరు ఏ ఉగ్రవాద సంస్థకు చెందిన వారన్నది ఇంకా తెలియడం లేదు.