Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్ లో తీవ్ర కలకలం సృష్టించిన కత్తిమహేశ్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వివాదం నాటకీయ తరహాలో ముగిసినట్టు కనిపిస్తోంది. పండుగ వరకు సైలెంట్ గా ఉన్న కత్తి మహేశ్… ఆ తర్వాత మళ్లీ పవన్ ఫ్యాన్స్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడడం, అనంతరం ఆయనపై జరిగిన కోడిగుడ్ల దాడి, ఆ దాడిని నిరసిస్తూ ఓయూ విద్యార్థులు ఆందోళనకు పిలుపునివ్వడం, తనపై దాడిచేసిన వారిపై కత్తి మహేశ్ పోలీస కంప్లయింట్ వంటి పరిణామాలు చూసి… ఈ వివాదం తీవ్రరూపు దాల్చుతుందని అందరూ భావించారు. తమ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు సంయమనం పాటించాలని సూచిస్తూ జనసేన ఉపాద్యక్షుడు బి. మహేందర్ రెడ్డి ప్రెస్ నోట్ విడుదల చేశారు.
జనసేన పార్టీది నాలుగేళ్లు కూడా నిండని పసిప్రాయమని, ఇలాంటి పసిబిడ్డను ఎదగనీకుండా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇదంతా రాజకీయంలో ఓ భాగమని, అవన్నీ పట్టించుకోకుండా ముందుకుపోవాలని ప్రెస్ నోట్ లో జనసేన ఉపాధ్యక్షుడు బి.మహేందర్ రెడ్డి కోరారు. ఈ ప్రెస్ నోట్ తర్వాత కత్తి మహేశ్ పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆ ప్రెస్ నోట్ లోనే తనమీద దాడిని ఖండిస్తూ చిన్న ముక్క రాస్తే సరిపోయేది కదా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ తనకు క్షమాపణలు చెప్పేవరకు తన పోరాటాన్ని కొనసాగిస్తున్నానని అన్నారు. అనంతరం ఏబీఎన్ లో జరిగిన చర్యాకార్యక్రమంలో పాల్గొన్నారు. పవన్ లేఖ విడుదల చేశారు కాబట్టి వివాదాన్ని ఇంతటితో ఆపేయాలని సినీ నిర్మాత రాంకీ కత్తి మహేశ్ ను కోరారు. తనపై దాడి జరిగాక పవన్ లేఖను విడుదల చేశారు కాబట్టి ఆపే ప్రసక్తే లేదని కత్తి తేల్చిచెప్పారు. ఆ తర్వాత మహాన్యూస్ లో జరిగిన చర్యాకార్యక్రమంలో సీన్ మారిపోయింది.
నాటకీయంగా పవన్ అభిమానులు, కత్తి మహేశ్ కు మధ్య సయోధ్య కుదిరింది. దీంతో కత్తి స్టూడియో నుంచి నేరుగా వెళ్లి మాదాపూర్ పోలీస్ట్ స్టేషన్ లో కేసు ఉపసంహరించుకున్నారు.అనంతరం పవన్ అభిమానులు, మహేశ్ కత్తి ఫిలింనగర్ లోని ఓ రెస్టారెంట్లో పార్టీ కూడా చేసుకున్నారు. తనకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం లేదని, కక్ష కానీ లేవని అన్నారు. కత్తి మహేశ్ కేసు ఉపసంహరించుకోవడంపై సినీ రచయిత కోన వెంకట్ ధన్యవాదాలు తెలిపాడు. ఈ మేరకు ట్విట్టర్ లో మహేశ్ కత్తి ఫొటో పోస్ట్ చేసి థాంక్స్ చెప్పారు. వివాదానికి ఇంతటితో ముగింపు పలికేందుకు ముందుకొచ్చిన నీకు ధన్యవాదాలు. నీ కెరీర్ బాగుండాలి. ఇకపై నిన్ను ఎవరూ దూషించరు. నీ జోలికి ఎవరూ రారు. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే వారు నీకు శత్రువులవుతారు. నన్ను నమ్ము అని ట్వీట్ చేశారు. ఈ వివాదం సమసిపోవడంపై టాలీవుడ్ లో హర్షం వ్యక్తమవుతోంది.