రిస్క్ చేసి చూస్తే… టైమేమో…

Kathi Mahesh Review on Agnathavasi movie

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అజ్ఞాత‌వాసిపై ఎన్ని వెబ్ సైట్లు, ఎంద‌రు స‌మీక్ష‌క‌లు రివ్యూలు ఇచ్చినా… అంద‌రూ ఎదురుచూస్తోంది మాత్రం వ‌ప‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ పై మాట‌ల‌యుద్ధం చేస్తున్న క‌త్తి మ‌హేశ్ అభిప్రాయం కోసం. బంజారా హిల్స్ ప్ర‌సాద్ ల్యాబ్స్ లో ఉద‌యం 8గంట‌ల షోకు వెళ్లిన క‌త్తి… బ‌య‌ట‌కు వ‌చ్చిన వెంట‌నే ట్విట్ట‌ర్ లో త‌న అభిప్రాయం కుండ‌బ‌ద్ద‌లు కొట్టాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న‌ల్లో భారీ హైప్ తో విడుద‌లైన అజ్ఞాత‌వాసిని క‌త్తి మ‌హేశ్ చికాకు పెట్టే సినిమాగా అభివ‌ర్ణించాడు. సినిమాను అప‌హాస్యం చేసిన చిత్రం అజ్ఞాత‌వాసి అని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించాడు. ప‌వ‌న్, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో వచ్చిన అత్యంత దారుణ‌మైన సినిమా అని ఎద్దేవా చేశాడు. సీరియ‌స్ గా ఉన్న క‌థ‌కి కామెడీ క‌థ‌నంతో చికాకు పెట్టార‌ని, రిస్క్ చేసి చూస్తే… టైమేమో… మీ ఇష్టం(ఈ సినిమాలో ఓ పాట ఈ ట్యూన్ లో ఉంది) అంటూ కామెంట్ చేశాడు. ఈ చిత్రం ఫ్రెంచ్ సినిమా లార్గో వించ్ కి కాపీయ‌ని గ‌తంలో క‌త్తి ఆరోపించిన సంగ‌తి తెలిసిందే.