బిగ్ బాస్ సీజన్ 2 ప్రారంభం అయిన రెండు వారాల్లోనే కౌశల్‌కు భారీ ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ అయిన విషయం తెల్సిందే. కౌశల్ ఆర్మీ పేరుతో కొందరు ఏకంగా సోషల్ మీడియా గ్రూప్‌ను రన్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ గురించిన చర్చ ఏ స్థాయిలో జరుగుతందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే బిగ్‌బాస్ ఇంట్లోని ఇతర సభ్యులకు సంబంధించిన వారు మరియు ఇతర సభ్యుల అభిమానులు మాత్రం కౌశల్ ఆర్మీ అనేది ఒక ఫేక్ ఆర్మీ అని, డబ్బులు ఇచ్చి రన్ చేయిస్తున్న ఆర్మీ అంటూ ఆరోపిస్తున్నారు. తాజాగా ఆ విషయమై పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది. ఇలాంటి సమయంలో కౌశల్‌ఆర్మీ గురించి ఒక విషయం వెలుగులోకి వచ్చింది. అది కాస్త యాంటీ కౌశల్ ఫ్యాన్స్‌కు ఆయుదంగా మారింది.
కౌశల్ ఆర్మీ గత కొన్నాళ్లుగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. రెండు వారాల క్రితం హైదరాబాద్‌లో 2కే రన్‌ను కౌశల్ ఆర్మీ నిర్వహించిన విషయం తెల్సిందే. తాజాగా వైజాగ్ మరియు విజయవాడలో కూడా కౌశల్ ఆర్మీ 2కే రన్ నిర్వహించారు. ఆ 2కే రన్‌లో పాల్గొన్న ఒక వ్యక్తి తనకు 400 రూపాయలు 2కేరన్ నిర్వాహకులు ఇచ్చారు అంటూ చెప్పుకొచ్చాడు. అంటే కౌశల్ ఆర్మీని ఎవరో ముందుండి నడుపుతున్నారు. వారు పెద్ద మొత్తంలో పెట్టుబడి కూడా పెడుతున్నారు అనిపిస్తుంది. అయితే కౌశల్ ఆర్మీ కోసం డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఎవరికి లేదని, ఒకవేళ డబ్బు ఖర్చు పెట్టినా ప్రయోజనం ఉండదు అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కౌశల్ ఆర్మీ ఆ వ్యక్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. కౌశల్ ఆర్మీ గురించి కొందరు కావాలని ఫేక్ వీడియోలో పోస్ట్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వ్యక్తం అవుతున్నాయి.