ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన నేడు ఢిల్లీలో జరగాల్సిన నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకాకూడదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేక ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేప్పట్టిన తరువాత ఆయన అధ్యక్షతన జరగబోతున్న తొలి నీతి ఆయోగ్ సమావేశం కావడంతో ఈ భేటీకి కేసీఆర్ హాజరవుతారని అంతా భావించారు. కానీ, త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో పలువురు ప్రముఖులను ఆహ్వనించాల్సి ఉండటం, రాష్ట్రంలోని పలు శాఖలపై కీలకమైన సమీక్షలు నిర్వహించాల్సి ఉన్నందునే కేసీఆర్ నీతి ఆయోగ్ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నట్టు తెలుస్తుంది. ఈ నెల 16న ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని ప్రత్యేకంగా ఆహ్వానించాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పీఎంవో అనుమతి కోరారు. ప్రధాని కార్యాలయం నుంచి అనుమతి వస్తే ఆయన ఢిల్లీ వెళ్తారు.