సొంత మనవరాలిని తల్లిని చేసిన కామాంధుడు

rape on nine months baby

సొంత మనవరాలిపైనే కన్నేశాడో తాత. కొడుకు కూతురు అని కూడా చూడకుండా తనలోని కామ దాహానికి ఆ బాలికని బలి పశువుని చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని చెప్పడంతో బాధితురాలు మౌనంగా అతడి అరాచకాన్ని భరించింది. చివరకు బాలిక గర్భం దాల్చడంతో ఆ కామాంధుడి అఘాయిత్యం బయటపడింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం రామస్వామిపేటలో నివాసముంటున్న ఓ కుటుంబంలోని 14ఏళ్ల బాలిక అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు శుక్రవారం ఆస్పత్రిలో చూపించాడు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు బాలిక ఐదు నెలల గర్భవతి అని చెప్పడంతో అంతా షాకయ్యారు. బాలికను ఇంటికి తీసుకెళ్లి ఏం జరిగిందని నిలదీయగా తాత తనపై సాగిస్తున్న అఘాయిత్యాన్ని చెప్పి బయటపడింది. తాత కొన్ని నెలలుగా తనపై అత్యాచారం చేస్తున్నాడని, ఈ విషయం ఎవరికైనా చెబితే తననుని చంపేస్తానని బెదిరిస్తున్నాడని బాలిక వాపోయింది. ఇంట్లో ఎవరూ లేని రోజు తాత తనతో కోరిక తీర్చుకునేవాడని బాలిక చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కూతురిపై తన తండ్రే అత్యాచారం చేయడాన్ని భరించలేకపోయిన బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదుచేశాడు.