Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కర్నాటక ఎన్నికలకు ముందూ, ఎన్నికల తర్వాతా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జేడీఎస్ కు ఎంతగానో సహకరించారు. తృతీయకూటమిపై చర్చించేందుకు కర్నాటక వెళ్లిన కేసీఆర్ దేవెగౌడతో భేటీ తర్వాత..జేడీఎస్ కు ఓట్లు వేయాల్సిందిగా అక్కడి తెలుగువారికి పిలుపునిచ్చారు. ఆ తర్వాత..ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన రాజకీయ ఆటలో.. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు హైదరాబాద్ లో రక్షణ కల్పించి…కర్నాటకం కూటమి వశమయ్యేలా సహకరించారు. అందుకే కుమారస్వామి సీఎంగా తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి మిత్రుడి హోదాలో కేసీఆర్ ను ఆహ్వానించారు. అయితే కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ కోసం జాతీయస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న కేసీఆర్ ఇప్పుడు కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి హాజరు కావాలా వద్దా…అన్న సందిగ్దంలోపడ్డారు.
జేడీఎస్ తో మిత్రభావం ఉన్నప్పటికీ…కాంగ్రెస్ సహకారంతో ఏర్పాటవుతున్న ప్రభుత్వ కార్యక్రమానికి హాజరయితే..ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయోమేనన్న ఆలోచనలో పడ్డారు కేసీఆర్. అయితే ఏపీ సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమానికి హాజరవుతుండడం, దేవెగౌడ, కుమారస్వామితో భవిష్యత్ మితృత్వం దృష్ట్యా ఆయన బుధవారం బెంగళూరు వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని టీఆర్ ఎస్ వర్గాలు అంటున్నాయి.