Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అమిత్ షా అంటే మోడీ అంతరాత్మ. ఈ సంగతి బీజేపీలో నేతలకే కాదు.. అందరికీ తెలుసు. అందుకే ఒకరిపై ఒకరికి ఫిర్యాదులు చేయడానికి కాషాయ నేతలే వెనుకాడతారు. కానీ చాలా విచిత్రంగా ప్రవర్తించే తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ధైర్యం చేసి షా తీరును మోడీ దగ్గరే ఎండగట్టారు. మరీ దారుణంగా అబద్ధాలు చెప్పారని, అందుకే విమర్శించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.
తమ ప్రభుత్వ అస్తిత్వానికే ముప్పు వాటిల్లుతుంటే చూస్తూ ఊరుకోలేనని కేసీఆర్ మోడీకి చెప్పారట. దీనికి మోడీ కూడా మౌనంగా ఉన్నారట. అంటే మోడీది అర్థాంగీకారమా.. లేదంటే కేసీఆర్ పని తర్వాత పడతాం అన్నట్లున్న వైఖరా అని గులాబీ నేతల్లో సందేహాలు మొదలయ్యాయి. దీనికి విరుగుడు గానే అసెంబ్లీ సీట్ల పెంపు పక్కన పెట్టారేమో అన్న అనుమానాలు వస్తున్నాయి.
పైగా దక్షిణాదిలో బీజేపీ బలపడటం అంత వీజీ కాదని కేసీఆర్ ప్రెస్ మీట్లో చెప్పడం కూడా మోడీకి మండించింది. పైకి నక్క వినయాలు ప్రదర్శిస్తూ.. లోపల ఇంత కుళ్లు ఉందా అని మోడీ విశ్లేషిస్తున్నారట. టైమ్ చూసి కేసీఆర్ కు రావాల్సిన నిధులు ఆపేస్తారేమోనని టీఆర్ఎస్ ఎంపీలు భయపడుతున్నారు. ఏదేమైనా కేసీఆర్ కాస్త తమాయించుకోవాలని సీనియర్లు చెబుతున్నారు.
మరిన్ని వార్తలు