Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలకు భారీగా ఒళ్లు ఉన్నా…బుద్ధి మాత్రం ఉండదని వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ లో రైతుబంధం పథకం ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దివాళా తీసిందని, ఆ పార్టీ నేతలు చెప్పే మాటలు వింటే ఆగమైపోతారని ముఖ్యమంత్రి హెచ్చరించారు. టీఆర్ ఎస్ పార్టీ నేతలంతా బక్కగా, సన్నగా ఉన్నప్పటికీ…పెద్ద పెద్ద పనులు చేస్తున్నామని, కాంగ్రెస్ నేతలకు మాత్రం భారీగా ఒళ్లు ఉంది కానీ బుద్ధిలేదని ఎద్దేవా చేశారు.
దశాబ్దాల పాటు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ టీఆర్ ఎస్ పూర్తిచేస్తోంటే కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్రాన్ని కోరుతామన్నారు. అన్ని పంటలకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తయితే మూడు పంటలు పండిచ్చుకోవచ్చని చెప్పారు. 950 టీఎంసీల గోదావరి నీటిని వాడుకునేందుకు ప్రణాళికలను రచిస్తున్నామని కేసీఆర్ తెలిపారు.