Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇన్నాళ్లూ బిల్డింగ్ పాలిటిక్స్ నడిపిన కేసీఆర్.. .ఇకపై జనంలోకి వెళ్లాలని డిసైడయ్యారు. చాలాచోట్ల ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, కేసీఆర్ మాటలకే దిక్కులేకుండా పోయిందని క్యాడర్ నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పార్టీని లైన్లో పెట్టడంతో పాటు ప్రజలకు దగ్గరవడానికి విస్తృతంగా జిల్లాల్లో తిరగాలని కేసీఆర్ డిసైడయ్యారు.
ఎన్నికల ముందు ప్రభుత్వ వ్యతిరేకత మొదలవడం కేసీఆర్ ను కలవరపెడుతోంది. పైస్థాయిలో అన్నిరకాలుగా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నా.. అవి ప్రజల వరకు వెళ్లడం లేదని ఆయన భావిస్తున్నారు. అధికారులు బాగా పనిచేస్తున్నా.. నేతలతో తలనొప్పి అవుతోందని కేసీఆర్ సన్నిహితుల దగ్గర ప్రస్తావించారట. పరిస్థితి ఇలాగే ఉంటే ఎన్నికల్లో జనాన్ని ఫేస్ చేయలేమని కేసీఆర్ అనుకుంటున్నారు.
అందుకే ఈ ఏడాదంతా విస్తృతంగా గ్రామాల్లో తిరగాలని, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించాలని భావిస్తున్నారు. ఇప్పటికే నేతల జాతకాలు తెప్పించుకున్న కేసీఆర్.. వెళ్లినచోటల్లా లీడర్లకు క్లాస్ పీకే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల కారణంగానే పార్టీ పలుచనవుతుందనే సర్వేలు కూడా వచ్చాయి. అందుకే ప్రతిపక్షాల్ని ఉద్దేశించి పాత కేసీఆర్ ను చూస్తారన్న కామెంట్లు.. ముందు సొంత పార్టీ నేతలకే వర్తిస్తాయని గులాబీ భవన్ వర్గాలు చెబుతున్నాయి.
మరిన్ని వార్తలు: