అమిత్ షాకు టచ్ లో హరీష్ రావు…అందుకే నో మినిస్ట్రీ…!

KCR Huge Shock To Harish Rao

టీఆర్‌ఎస్ ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ అధికారికంగా జరగకపోయినా మంత్రులు ఎవరు అనే దాని మీద ఓ క్లారిటీ వచ్చేసింది. తొలి విడతలో భాగంగా 9 మందిని సీఎం కేసీఆర్ దాదాపుగా ఖరారు చేశారు. అయితే ఆ 9మందిలో హరీష్ రావు పేరు లేదంటూ వార్తలొస్తున్నాయి. ఇదే అంశంపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఎన్నికల సమయంలో హరీష్ రావు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో రహస్యంగా ఫోన్ లో టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆ ఫోన్ రికార్డ్‌లను హరీష్ రావు పీఏ స్వయంగా కేసీఆర్‌కు ఇచ్చారని అందుకే ఈసారి హరీష్ ని కేసీఆర్ పక్కన పెట్టారని ఆయన సంచలన ఆరోపణ చేశారు.

అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న మిడ్ మానేరు, గౌరెల్లి, తోట పల్లి నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ వెయ్యికోట్లు దోచుకున్నాడని రేవంత్ ఆరోపించారు. అలా సంపాదించిన డబ్బులను కేసీఆర్ కు తెలియకుండా అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్ పంచి పెట్టారని తెలపారు. ఇలా తన వర్గానికి చెందిన దాదాపు 30 మందికి హరీష్ డబ్బులు పంచారని రేవంత్ సంచలన ఆరోపణలు చేసారు. ఈ విషయాలన్ని కేసీఆర్ దృష్టికి వెళ్లడంతో అప్పటినుండి హరీష్ ను దూరం పెట్టారన్నారు. ఈ కారణాల వల్లే హరీష్ కు ఈసారి మంత్రి పదవి కూడా లభించడం లేదని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.